రజినీకాంత్ పార్టీ చిహ్నం ఇదే... కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్న తలైవా
సూపర్‌స్టార్ రజినీకాంత్ తన రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కీలకంగా మారే పార్టీ చిహ్నంపై ఆయన ఫోకస్ పెట్టారు. పార్టీ చిహ్నంగా సైకిల్ కీలకం కానుంది. అయితే సైకిల్ ఆయన పార్టీకి దక్కుతుందా? లేదా? అన్నది పక్కనబెడితే... సైకిల్, పాల క్యాన్‌తో రజినీ స్టైల్‌ను రాజకీయ చిహ్నంగా ఎంపిక చేయడానికి నిర్ణయించినట్టు తెలిసింది. మరోవైపు మూడు వర్ణాలతో పార్టీ జెండా కూడా సిద్ధం చేస్తున్నారు. Also Read: గురువారం పార్టీ ముఖ్యులు అర్జున్‌మూర్తి, తమిళరివి మణియన్ మక్కల్ మండ్రం జిల్లాల కార్యదర్శులతో భేటీ అయిన పార్టీ పేరు, చిహ్నం, జెండా విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ పేరును సీక్రెట్‌గా ఉంచినా.. చిహ్నం, జెండాపై మాత్రం లీకులు బయటకు వచ్చాయి. ప్రజల్ని ఆకర్షించే విధంగా మూడు వర్ణాలతో రజనీ పార్టీ జెండా రూపుదిద్దుకోబోతున్నట్లు తెలుస్తోంది.
పార్టీ చిహ్నంగా సైకిల్‌ను ఫైనల్ చేస్తే ఏవైనా అభ్యంతరాలు, వివాదాలు తలెత్తే అవకాశాలు ఉండవచ్చని రజినీ సన్నిహితులు భావిస్తున్నారు. దీంతో ‘అన్నామలై’ చిత్రంలో సైకిల్, పాల క్యాన్ గెటప్‌లో ఉన్న రజినీ ఫోటోనే పార్టీకి చిహ్నంగా మార్చాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జెండా, చిహ్నం విషయంలో మక్కల్ మండ్రం నిర్వాహకులు అంగీకారం తెలిపినా రజినీకాంత్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు రజినీకాంత్ స్థాపించే పార్టీ విజయవంతం కావాలని ఆయన సోదరుడు సత్యనారాయణ గురువారం తిరువణ్ణామలైలోని అరుణ గిరినాథర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 31వ తేదీన రజినీకాంత్ రాజకీయ పార్టీ ప్రకటన చేయడం ఖాయం ఆయన స్పష్టం చేశారు. పార్టీలో చాలామంది ప్రముఖులు రాబోతున్నారని తెలిపారు. రజినీకాంత్ తిరువణ్ణామలై నుంచి పోటీ చేయాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు.By December 11, 2020 at 10:49AM
No comments