నాన్న మూడెకరాలు అమ్మిన చోటే నేను పదెకరాలు కొన్నా: హైపర్ ఆది
‘’ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది ముందు వరుసలో ఉంటాడు. తనదైన పంచ్‌లతో చాలా తక్కువ సమయంలోనే ఆది భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ వరుసలోనే సినిమాల్లోకి ఎంట్రీ అక్కడా గుర్తింపు తెచ్చుకున్నాడు. తరుచూ ఏదొక షోలో సందడి చేసే హైపర్ ఆది ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన ఆదాయం గురించి, కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. Also Read: ఇంజినీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కొంతకాలం పనిచేశారని, రైటింగ్ వైపు మనసు మళ్లడంతో అటు వైపు వచ్చేశానని ఆది చెప్పాడు. ఆ తర్వాత జబర్దస్త్‌లో అవకాశం రావడంతో కొద్దిరోజులకే హైపర్ ఆదిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నానని వెల్లడించారు. అయితే తాను జబర్దస్త్‌కు రాకముందు కుటుంబ పరిస్థితి దారుణంగా ఉండేదని, తమ చదువు కోసం తండ్రి ఆస్తులన్నీ అమ్మేశాడని చెప్పాడు. Also Read: ఊళ్లో ఉన్న మూడెకరాల పొలాన్ని తమ కోసం తండ్రి అమ్మేయడం చాలా బాధనిపించినా.. ఆ పరిస్థితుల్లో ఏమీ చేయలేకపోయామని హైపర్ ఆది ఆవేదనతో చెప్పాడు. అయితే తనకు జబర్దస్త్‌లో అవకాశం వచ్చిన తర్వాత తమ కుటుంబ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, ఆర్థికంగా నిలదొక్కుకున్నామని తెలిపాడు. నాన్న మూడెకరాలు అమ్మేసిన ప్రాంతంలోనే ఇప్పుడు తాను పదెకరాల పొలం కొనుగోలు చేశానని, స్వగ్రామంలో పెద్ద ఇల్లు కూడా కట్టానని ఆది చెప్పాడు.
By December 02, 2020 at 11:01AM
No comments