Breaking News

బెంగాల్ సీఎం మమత సంచలన నిర్ణయం.. తెలుగువారికి శుభవార్త


పశ్చిమ్ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలని ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. నుంచి గట్టిపోటీ ఎదురువుతున్న నేపథ్యంలో మమతా వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. బెంగాల్‌లో స్థిరపడిన తెలుగు ఓటర్లను తనవైపు తిప్పుకోడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తెలుగుకు అధికార భాష హోదా కల్పిస్తూ మంగళవారం జరిగిన క్యాబినెట్‌లో మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. తెలుగువారిని తమ రాష్ట్రంలో భాషాపరమైన మైనారిటీలుగా గుర్తించారు. ‘మినీ ఆంధ్రా’గా గుర్తింపు పొందిన ఖరగ్‌పూర్‌లోని తెలుగువారిని ఆకర్షించి, వారి ఓట్లను పొందేందుకే దీదీ ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రైల్వే ఉద్యోగాల కోసం ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లి అక్కడే స్థిరపడిన వేలాది మంది తెలుగువారు అక్కడి రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఖరగ్‌పూర్‌ మునిసిపాలిటీలోని 35 వార్డుల్లో ఆరుగురు తెలుగువాళ్లే కౌన్సిలర్లుగా ఉండటం విశేషం. వివిధ పార్టీల్లో తెలుగువాళ్లు కీలక పదవులు, బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలుగుకు అధికార భాష హోదా కల్పించాలని అక్కడి ప్రజల నుంచి చాలాకాలంగా డిమాండ్‌ వినిపిస్తోంది. మంగళవారం నాటి క్యాబినెట్‌ నిర్ణయాన్ని బెంగాల్‌ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ మీడియాకు వెల్లడించారు. హిందీ, ఉర్దూ, నేపాలీ, గురుముఖి, ఒడియా తదితర భాషలకు ఇప్పటికే అధికార భాష హోదాను బెంగాల్ ప్రభుత్వం కల్పించింది. మరోవైపు, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. మంగళవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశానికి నలుగురు మంత్రులు డుమ్మా కొట్టారు. మంత్రులు గౌతమ్‌దేవ్‌, రవీంద్రనాథ్‌ ఘోష్‌, చంద్రనాథ్‌ సిన్హా, రాజీవ్‌ బెనర్జీ హాజరుకాకపోవడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటీవలే మంత్రి సుబేందు అధికారి టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.


By December 23, 2020 at 07:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/west-bengal-govt-decides-to-give-telugu-as-official-language-statuso/articleshow/79905069.cms

No comments