Breaking News

కాంట్రాక్టర్‌ని చంపి వాహనాలకు నిప్పు.. ఏవోబీలో మావోయిస్టుల దుశ్చర్య


ఆంధ్ర - ఒడిశా బోర్డర్‌లో మరోమారు దుశ్చర్యకు పాల్పడ్డారు. రహదారి నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ని అతి దారుణంగా హత్య చేశారు. రోడ్డు పనులు నిర్వహిస్తున్న జేసీబీ, ట్రాక్టర్ సహా బొలెరో వాహనాన్ని తగలబెట్టారు. ఈ దారుణ ఘటన ఏపీ సరిహద్దు జిల్లా అయిన మల్కన్‌గిరిలో చోటుచేసుకుంది. మతిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దంగ్రిగూడా గ్రామ పరిధిలో ఈ ఘటనతో ఏవోబీలో అలజడి రేగింది. రహదారి పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌ సుకుమార్ మండల్‌పై కన్నెర్రజేశారు. ఆయనను అతిదారుణంగా చంపేశారు. విశాఖ జిల్లా సరిహద్దులో ఈ ఘటన జరగడంతో స్థానికంగా కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:


By December 17, 2020 at 02:51PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/maoists-kills-contractor-set-vehicles-on-fire-in-odisha/articleshow/79776842.cms

No comments