రెండో పెళ్లికి సిద్ధమైన దర్శకేంద్రుడి మాజీ కోడలు.. ప్రొడ్యూసర్‌తో నిశ్చితార్థం
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు మాజీ భార్య, ప్రముఖ రైటర్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. బాలీవుడ్ ఫేమస్ రైటర్, ప్రొడ్యూసర్ హిమాన్షుతో కనికా థిల్లాన్ నిశ్చితార్థం సోమవారం జరిగింది. ఈ విషయాన్ని కనికా థిల్లర్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడిస్తూ ఫోటోలు కూడా షేర్ చేశారు.
ప్రకాష్, కనికా థిల్లర్ 2014, ఆగస్టులో పెళ్లి చేసుకున్నారు. అనుష్క కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయిన ‘సైజ్ జీరో’ సినిమాకు వీళ్లిద్దరు కలిసి పనిచేశారు. ఈ సినిమా కనికా కథను సమకూర్చగా, ప్రకాష్ డైరెక్ట్ చేశారు. అయితే ఈ దంపతుల మధ్య విబేధాలు చోటుచేసుకున్నాయని, విడాకులు తీసుకోనున్నారంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. విడాకులు తీసుకున్నప్పటికీ ఈ విషయాన్ని ఇరువురు బయటికి వెల్లడించలేదు. ఈ క్రమంలోనే కనికా ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. బాలీవుడ్‌లో అనేక సినిమాలకు రైటర్‌గా పనిచేసిన కనికా ఇప్పటివరకు కమర్షియల్‌గా సక్సెస్ అందుకోలేకపోయారు. కానీ ఆమె ప్రతిభకు ప్రశంసలు మాత్రం దక్కాయి. ఇప్పుడు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కమ్ రైటర్‌ని పెళ్లి చేసుకోబోతుండటంతో వీరిద్దరు కలిసే కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశాలున్నాయి. మాజీ భార్య రెండో పెళ్లికి సిద్ధం కావడంతో.. మరి ప్రకాష్ కోవెలమూడి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.By December 16, 2020 at 09:20AM
No comments