Breaking News

ఐరాస దృష్టికి రైతుల ఉద్యమం.. సంచలన వ్యాఖ్యలు


వ్యవసాయ చట్టాల విషయమై కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య జరిగిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. శనివారం మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 7 గంటల వరకు సుదీర్ఘంగా చర్చలు జరిగినా ఏ విషయం తేలకపోవడంతో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. దాంతో ముందుగా నిర్ణయించినట్టు ఈ నెల 8న భారత్‌ బంద్‌ పాటిస్తామని రైతులు ప్రకటించారు. బిల్లుల రద్దుపై తప్ప మిగతా విషయాలపై చర్చించే ప్రసక్తేలేదని రైతులు తేల్చిచెప్పారు. చర్చల్లోనూ రైతు నాయకులంతా నిశ్శబ్దంగా కూర్చొని మౌన వ్రతం పాటించారు. ఇదిలా ఉండగా రైతుల ఆందోళనలకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఈ అంశంపై తాజాగా దృష్టికి వెళ్లింది. రైతుల ఉద్యమాన్ని అడ్డుకోరాదని ఐరాస కోరింది. శాంతియుతంగా ప్రదర్శనలు చేసే హక్కు ప్రజలకు ఉందని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ అధికార ప్రతినిధి స్టిఫేనే జూరిక్‌ అన్నారు. శాంతియుత ప్రదర్శనలు చేసుకోవడానికి అధికార యంత్రాంగం అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. అటు, బ్రిటన్‌ ఎగువ సభ ‘హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌’లో రైతుల ఉద్యమ ప్రస్తావన వచ్చింది. లార్డ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌ దీనిపై ప్రశ్నించగా.. కేబినెట్‌ ఆఫీసు మంత్రి లార్డ్‌ నికోలస్‌ ట్రూ సమాధానమిస్తూ ఇతర దేశాల వ్యవహారాలను ఖండించలేమన్నారు. రైతులు ఉద్యమానికి బ్రిటిష్‌ ఎంపీలు మద్దతు తెలిపారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌తో మాట్లాడాలని కోరుతూ బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డొమినిక్‌ రాబ్‌కు వినతిపత్రం సమర్పించారు. లేబర్‌ పార్టీ ఎంపీ తన్‌మన్‌జీత్‌ సింగ్‌ దేశీ రాసిన లేఖపై భారత సంతతి ఎంపీలు విజేంద్ర శర్మ, సీమా మల్హోత్రా, వాలరీ వాజ్‌లతోపాటు ఆ పార్టీ అగ్ర నాయకుడు జెరెమీ కోర్బిన్‌ సంతకాలు చేశారు.


By December 06, 2020 at 08:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/people-have-a-right-to-demonstrate-peacefully-un-on-farmers-protest/articleshow/79588529.cms

No comments