Breaking News

ఏకకాలంతో ఆరుగురితో డేటింగ్.. ఒకేసారి గర్బం దాల్చిన ప్రియురాళ్లు!


ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా ఆరుగురి ప్రియురాళ్లతో డేట్‌ చేస్తున్న నైజీరియా విలాస పురుషుడు ప్రెట్టీ మైక్... తన ప్రియురాళ్లందరూ ఒకేసారి గర్భం దాల్చినట్టు గర్వంగా చెప్పుకున్నాడు. తన స్నేహితుడి వివాహానికి వారిని వెంటేసుకుని వచ్చిన ప్రెట్టీ.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రియురాళ్లు సిల్వర్ డ్రెస్‌లో ఉండగా.. చుక్కల్లో చంద్రుడి మాదిరిగా పింక్ కలర్ సూట్‌లో ఆయన మెరిసిపోయారు. ధనవంతుడైన మైక్ ఓ క్లబ్‌ ఓనర్‌.. అతడి అసలు పేరు మైక్ ఈజ్ న్యావలే వోగ్. స్నేహితుడి పెళ్లికి ప్రియురాళ్లతో వెళ్లిన మైక్‌ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీటిని షేర్ చేశారు. ‘ప్రెట్టీ మైక్.. అతని ఆరుగురు బేబీ మదర్స్.. ఇది ఫిల్మ్ ట్రిక్ కాదు.. మేము మా ఉత్తమ జీవితాన్ని గడుపుతున్నాం #ABetterTime #HappyHome #Familyiseverything’అంటూ క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ప్రెట్టీ విన్యాసాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. 33 ఏళ్ల ప్రెట్టీకి ఘనమైన ట్రాక్ రికార్డే ఉంది. ఒకసారి నైజీరియా రాజధాని చుట్టూ అమ్మాయిలతో సహా కుక్కలతో పరేడ్ నిర్వహించడంతో అరెస్టు అయ్యాడు. వివాదాలతో సహవాసం చేసే ప్రెట్టి.. సెక్స్ గురించి తన జంతు వాంఛలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్లతో పంచుకుంటాడు. దీనిపై క్రమం తప్పకుండా సలహాలు ఇస్తాడు. లాగోస్ నైట్‌స్పాట్ క్లబ్‌ను యజమాని అయిన ఈ నైజీరియా ప్లేబాయ్, విలాసవంతమైన జీవితాన్ని గడుతుంటాడు. అంత్యంత ఖరీదైన గూచీ, వెర్సేస్, డోల్స్ ,గబ్బానా వంటి కార్లనుఇష్టపడతాడు. తల్లిదండ్రులకు తొమ్మిది మంది సంతానంలో ఒకరైన ప్రెట్టీ మైక్.. తన ఇద్దరు సోదరిల మాదిరిగా అందంగా ఉండటం వల్ల చిన్నతంలో ఆ పేరు వచ్చినట్టు చెప్పుకుంటాడు. ఇక, 2016లో తన పెంపుడు కుక్కలతో కవాతు నిర్వహించి వార్తల్లో నిలిచాడు. అందమైన అమ్మాయిలు, కుక్కలకు గొలుసులు కట్టి వివాదంలో ఇరుక్కున్నాడు. మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు సోషల్ మీడియాలో తీవ్ర దుమారమే రేగింది. అలాగే ఓ మహిళా యాంకర్‌ను తన కుక్కుతో పోల్చిన మైక్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తాయి.


By December 02, 2020 at 09:12AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/lavish-life-of-nigerian-playboy-pretty-mike-who-claims-to-have-six-pregnant-girlfriends/articleshow/79522367.cms

No comments