Breaking News

ప్రయాణికులకు రైల్వే న్యూ ఇయర్ గిఫ్ట్.. టిక్కెట్ బుకింగ్ మరింత ఈజీ


నూతన సంవత్సరం సందర్భంగా ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ () వెబ్‌సైట్‌ను గురువారం 12 గంటలకు అప్ గ్రేడ్ చేయనున్నారు. వెబ్‌సైట్‌ అప్‌గ్రేడ్ వల్ల ప్రయాణికులు మరింత సులభంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. వెబ్‌సైట్ అప్‌గ్రేడ్ చేయడం వల్ల ట్రెయిన్ టికెట్లను వేగంగా బుక్ చేసుకోవచ్చని, బుకింగ్ సామర్థ్యం కూడా పెంచనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొత్త వెబ్‌సైట్ ద్వారా ట్రెయిన్ టికెట్‌‌తో పాటు ఆహారం కూడా బుక్ చేసుకునే సౌలభ్యాన్ని ఉంది. టిక్కెట్ల బుకింగ్‌లో మోసాలు, నకిలీ ఏజెంట్ల జోక్యాన్ని నివారించడానికి , యాప్‌ను వినియోగదారులకు మరింత అనుకూలంగా మార్చడానికి రైల్వే ప్రయత్నిస్తోంది. అదే సమయంలో కొత్త వెబ్‌సైట్‌లో ప్రకటనలకు కూడా ఎక్కువ స్థలాన్ని కేటాయించింది. దేశంలో డిజిటల్ ఇండియా ప్రభావంతో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ పెరిగింది. దీంతో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను ఇండియన్ రైల్వే అప్‌గ్రేడ్ చేయడంతోపాటు ప్రయాణీకుల సౌలభ్యం కోసం కొత్త ఫీచర్లను జోడించారు. వైబ్‌సైట్‌లో మార్పుల వల్ల సామర్ధ్యం పెరుగుతుంది. ఒకేసారి ఎక్కువ మంది టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలో బుకింగ్ ఒత్తిడి వల్ల వెబ్‌సైట్ క్రాష్‌ అయ్యే అవకాశం ఉండదు. టికెట్ బుకింగ్ తర్వాత ప్రయాణికుల చెల్లింపు కోసం మరిన్ని ఆప్షన్లు చేర్చనున్నారు. ఇక, 2014 నుంచి టిక్కెట్ల బుకింగ్, సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రాధాన్యత ఇస్తోంది. భారతీయ రైల్వేలో ప్రయాణిస్తున్న వారికి ఐఆర్‌సీటీసీ ఇ-టికెటింగ్ వెబ్‌సైట్ మొదటి సంప్రదింపు కేంద్రంగా నిలిచింది. ప్రయాణం కోసం టికెట్లు బుక్ చేసుకున్న అనుభవం, స్నేహపూర్వకంగా, సౌకర్యవంతంగా ఉండాలని రైల్వే మంత్రి అభిప్రాయపడ్డారు. చివరిసారిగా 2018లో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను రైల్వే శాఖ అప్‌గ్రేడ్ చేసింది.


By December 31, 2020 at 11:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/booking-tickets-to-become-easy-for-passengers-with-revamp-of-irctc-website/articleshow/80041511.cms

No comments