తొలిసారి ఆ పాత్రలో కాజల్.. రిస్క్ చేస్తోందా?
ఇటీవలే హనీమూన్‌ను ముగించుకుని వచ్చిన సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘ఆచార్య’, ‘మోసగాళ్లు’ సినిమాలతో పాటు తమిళంలో కమల్ హాసన్ సరసన ‘ఇండియన్-2’లో నటిస్తోంది. బాలీవుడ్‌లో ‘ముంబై సాగా’, మలయాళంలో దుల్కర్ సల్మాన్ సరసన ‘హే సినామికా’లోనూ నటిస్తోంది. అయితే తాజాగా మరో తమిళ సినిమాకు కాజల్ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. Also Read: డీకే దర్శకత్వంలో తెరకెక్కబోయే హారర్ మూవీలో కాజల్ నటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరి కాంబినేషన్లో ‘కావలై వేందామ్’ అనే సినిమా వచ్చింది. డీకే చెప్పిన కథ నచ్చడంతో కాజల్ వెంటనే ఓకే చెప్పేసిందట. దీంతో కెరీర్లో తొలిసారి ఆమె ప్రేక్షకులను భయపెట్టే పాత్రలో కనిపించనుంది. దీనికి తోడు ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు ఉంటారట. మిగిలిన ముగ్గురు కథానాయికలను ఎంపిక చేసే పనిలో పడ్డారట డైరెక్టర్ డీకే. ఇప్పటివరకు లవ్, రొమాంటిక్, సెంటిమెంట్ పాత్రల్లోనే కనిపించిన కాజల్ ప్రేక్షకులను భయపెట్టగలదా? లేదా? అన్నది చూడాలి.
By December 02, 2020 at 07:20AM
No comments