Breaking News

ప్రేమజంట విచిత్ర వివాహం: తండ్రిపై కుమార్తె ఫిర్యాదు.. అంతలోనే ప్రియుడితో పెళ్లి


తన తండ్రి కొడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ యువతిని ఆరా తీయగా దానికి ప్రేమ వ్యవహారం కారణమని తేలింది. దీంతో ఆమెకు పోలీస్ స్టేషన్‌లోనే పెళ్లి జరిపించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా జనపథ్ పరిధిలోని బిర్లసీ చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ప్రేమ జంట విచిత్ర వివాహంపై ఆ ప్రాంతంలో పెద్ద చర్చ జరుగుతోంది. జ్ఞానా మాజరా రోడ్నా గ్రామంలోని ఉదంతంపై పోలీసులు మాట్లాడుతూ... ప్రీతి అనే యువతి బిర్లసీ చౌకీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తన తండ్రి తన ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఆమె కథనంతా విన్న స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఆనంద్ పాశ్వాన్ ప్రియుడు రవి సహా ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్‌కు రప్పించారు. వారికి నచ్చజెప్పి ఆ జంటకు వివాహం జరిపించారు. జ్ఞానమజ్రా రోడన్ గ్రామానికి చెందిన జనేశ్వర తన కుటుంబంతో కలిసి ఏటా పంజాబ్‌లోని ఇటుక బట్టీల్లో పనులు కోసం వలస వెళ్తాడు. ఈ ఏడాది కూడా తన కుమార్తె ప్రీతి ఇతర పిల్లలను తీసుకుని పని కోసం వెళ్లాడు. బుధానా జిల్లా బిటావడాకు చెందిన రవి అనే యువకుడు సైతం అక్కడ పనుల కోసం వెళ్లగా.. ప్రీతితో పరిచయం ప్రేమకు దారితీసింది. కూతురి ప్రేమ వ్యవహారం తెలియడంతో జానేశ్వర్ తన కుటుంబాన్ని తీసుకుని సొంతూరుకు పది రోజుల కిందట వచ్చేశాడు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా రవితో ఆమె ఫోన్‌లో మాట్లాడుతుండటం గమనించిన జానేశ్వర్.. కుమార్తెను మందలించాడు. శుక్రవారం ఆమెపై చేయిచేసుకున్నాడు. దీంతో అదే రోజు రాత్రి బిర్లాసీ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తండ్రి తనను కొడుతున్నాడని ఫిర్యాదు చేసింది. ఆమెను విచారించిన పోలీసులు.. అసలు విషయం తెలుసుకుని ఇరు వర్గాలను, గ్రామ పెద్దను పిలిపించి మాట్లాడారు. రవితో పెళ్లికి జానేశ్వర్‌ను ఒప్పించి, దగ్గరుండి వివాహం జరిపించారు. ఆదివారం ఉదయం ఈ వివాహ తంతు కానిచ్చేశారు. పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ వివాహానికి ఇరువురి కుటుంబాలు, గ్రామస్థులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.


By December 21, 2020 at 08:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/police-has-conducted-the-wedding-of-a-lovers-in-muzaffarnagar-in-up/articleshow/79832435.cms

No comments