Breaking News

సమాజం నాకు చాలా ఇచ్చింది.. ఇప్పుడు రుణం తీర్చుకుంటా: దిల్ రాజు


తెలుగు సినీ ఇండస్ట్రీలోకి డిస్ట్రిబ్యూటర్ అడుగుపెట్టి అగ్ర నిర్మాతగా ఎదిగారు . తొలి సినిమా ‘దిల్’నే ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఎంతో మంది దర్శకులు, ఇతర టెక్నీషియన్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన క్రెడిట్‌ ఆయనకే దక్కుతుంది. నేటితో(డిసెంబర్‌ 18) దిల్‌రాజు 50వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి టాలీవుడ్‌ ప్రముఖులకు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాను ప్రొఫెషనల్‌గానే కాకుండా వ్యక్తిగతంగానూ సామాజిక సేవలో భాగస్వామి అవుతున్నట్లు ప్రకటించారు. Also Read: ‘నాకొక గ్రేట్‌ ఎక్స్‌పీరియెన్స్ ముఖ్యంగా సక్సెస్‌లో ఉన్నప్పుడు నాకు ఇలాంటి మూమొంట్‌ రావడం నా అదృష్టం. సినిమా పరిశ్రమలోకి వచ్చి దాదాపు 25 సంవత్సరాలైంది. యాబై ఏళ్లలో పాతికేళ్లు సినిమాలతోనే అనుబంధ కొనసాగింది. ఎన్నో సక్సెస్‌లు సాధించి నిర్మాతగా ఎదిగా. ఈ క్రమంలోనే పేరు, డబ్బు వస్తుంటాయి. ఈ మధ్యే సెకండ్ లైఫ్‌ స్టార్ట్ చేశా. ఈ కొత్త లైఫ్‌లో ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే.. సమాజానికి ఏదైనా తిరిగివ్వాలన్న ఆలోచన వచ్చింది. Also Read: దాని నుంచే సోషల్‌ సర్వీస్ ప్రారంభిస్తున్నాను. దీనిపై ఆసక్తి ఉన్నవారెవరైనా మాతో జాయిన్ కావొచ్చు. మీడియా వాళ్ల దృష్టికి చాలా సమస్యలు వస్తుంటాయి. అలాంటి వాటిలో నిజమైనవి గుర్తించి తెలియజేస్తే నా వంతుగా వారికి సాయపడతా. ముఖ్యంగా విద్యా, ఆరోగ్య పరమైన సమస్యలకు ప్రాధాన్యత ఇస్తాం’ అని తెలిపారు. శ్రీమంతుడు తరహాలో ‘సమాజం మనకు చాలా ఇచ్చింది. తిరిగివ్వకపోతే లావైపోతాం’ అన్న పద్ధతిని దిల్ రాజు ఫాలో అవుతున్నారన్న మాట.


By December 18, 2020 at 11:46AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/producer-dil-raju-to-planning-for-start-social-service/articleshow/79792097.cms

No comments