Breaking News

తూచ్.. రాత్రి పూట క‌ర్ఫ్యూ లేదు!


రాత్రిపూట కర్ఫ్యూపై కర్ణాటక ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కర్ఫ్యూపై ఉత్తర్వులు జారీ చేసిన 24 గంటల వ్యవధిలోనే యూటర్న్ తీసుకుంది. అంతేకాదు, కర్ఫ్యూలో భాగంగా రాత్రి పూట 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే తాజా ప్రకటన చేసింది. యూకేలో పంజా విసురుతున్న కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్ వార్తల నేపథ్యంలో బెంగళూరు నగరంలో గురువారం (డిసెంబర్ 24) నుంచి రాత్రిపూట విధిస్తున్నట్లు యడియూరప్ప ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. కొత్త కరోనా వైరస్ వ్యాప్తి, రాష్ట్రంలో తాజా ప‌రిస్థితిపై కర్ణాటక ప్రభుత్వం గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్ష అనంతరం బెంగళూరులో కర్ఫ్యూ ఉపసంహరించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ సూచ‌న మేర‌కు రాత్రి పూట క‌ర్ఫ్యూ ఆదేశాల‌ను వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది. గురువారం రాత్రి నుంచి కర్ఫ్యూ అమలు చేయడానికి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంటల వ‌ర‌కూ క‌ర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు చేయడానికి బలగాలను సిద్ధం చేశారు. కర్ఫ్యూ అమ‌లు చేయ‌డానికి కొన్ని గంటల ముందే ఆ ఆదేశాల‌ను వెన‌క్కి తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.


By December 24, 2020 at 06:15PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-govt-withdraws-bengaluru-night-curfew-order/articleshow/79942241.cms

No comments