అభిమానం తలకెక్కి రోడ్డుపాలై.. సాయం కోసం మెగా ఫ్యాన్ ఎదురుచూపులు
సినిమా హీరోలంటే చాలామందికి అభిమానం.. కానీ ఆ అభిమానం ముదిరితే మాత్రం ఇబ్బందులు తప్పవు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం మహబూబాబాద్‌కు చెందిన భట్టు బాలాజీ అనే వ్యక్తి. పట్టణంలోని భవానీనగర్‌కు చెందిన బాలాజీకి మెగాస్టార్ అంటే ప్రాణం. ఆయన సినిమా వచ్చిందంటే రిలీజ్ రోజు మొదటి షోనే చూసేవాడు. సొంత ఖర్చులతో చిరు కటౌట్లకు పాలాభిషేకం చేయడం, వంద రోజులకు ఫంక్షన్లు నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే ‘స్టేట్ రౌడీ’ రిలీజ్ రోజు టిక్కెట్ల కోసం జరిగిన తోపులాటలో బాలాజీ ఎడమ కన్ను పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ చిరుపై అతడికి అభిమానం మరింత పెరిగింది. అప్పట్లో చిరు బ్లడ్ బ్యాంక్ కోసం మానుకోట నుంచి 150 మందిని సొంత ఖర్చుతో హైదరాబాద్ తీసుకెళ్లి రక్తదానం చేయించాడు. Also Read: చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీ కోసం తన మూడెకరాల పొలాన్ని అమ్మేసి ఖర్చు చేసేశాడు. ఇలా చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యక్రమాల కోసం తన తండ్రి సంపాదించిన ఆస్తినంతా విచ్చలవిడిగా ఖర్చు చేసేసిన బాలాజీ ఇప్పుడు నిలువ నీడ కూడా లేకుండా పోయాడు. బతుకుదెరువు కోసం భార్య పూలు అమ్ముతుంటే, తన పిల్లలు ఇతరుల ఇళ్లల్లో పనులు చేస్తున్నారు. దీంతో తనను చిరంజీవి ఆదుకోవాంటూ బాలాజీ వేడుకుంటున్నారు. అయితే తాను చిరంజీవిని కలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా మధ్యలో ఉన్నవారు అనుమతి ఇవ్వడం లేదని బాలాజీ కన్నీరుమున్నీరవుతున్నాడు. Also Read:
By December 03, 2020 at 09:15AM
No comments