పృథ్వీ బ్యాడ్‌లక్.. గడ్డం తీయడం వల్ల హీరో ఛాన్స్ కోల్పోయాడు
సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా ఉండాలని చెబుతుంటారు. అనూహ్యంగా అవకాశాలు దక్కించుకుని సూపర్‌స్టార్లు అయిన వారు కొందరుంటే.. ఎన్ని అవకాశాలు వచ్చినా గుర్తింపు దక్కక కనుమరుగైపోయిన వాళ్లూ ఉన్నారు. ఒక్కోసారి విచిత్రమైన కారణాల వల్ల కూడా ఛాన్సులు కోల్పోవాల్సి వస్తుంది. పెళ్లి’ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీకి కూడా ఓసారి ఇలాంటి అనుభవమే ఎదురైందట.
అక్కినేని నాగేశ్వరరావు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన ‘సీతా రామయ్యగారి మనవరాలు’ అప్పట్లో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. నిజానికి ఈ సినిమాలో హీరోగా పృథ్వీని తీసుకోవాలనుకున్నారట దర్వకుడు క్రాంతి కుమార్. సినిమా ప్రారంభానికి ముందుకు పృథ్వీరాజ్‌ను గడ్డంతో చూసిన ఆయన మెచ్చుకున్నారట. తాను అవకాశాల కోసం తిరుగుతూ షేవింగ్ చేసుకోకపోవడం వల్లే గడ్డం పెరిగిపోయిందని ఆయన చెప్పారట. తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని, రేపు లొకేషన్‌కి రావాలని క్రాంతి కుమార్ చెప్పడంతో పృథ్వీ ఎగిరి గంతేశారట. Also Read: ఎట్టకేలకు మంచి అవకాశం పృథ్వీ మరుసటి రోజు నీట్‌గా షేవింగ్ చేసుకుని లొకేషన్‌కి వెళ్లారట. పృథ్వీని అలా చూసి షాకైన క్రాంతి కుమార్ ఆగ్రహంతో ఊగిపోయారట. నిన్ను షేవింగ్ ఎవరు చేసుకోమన్నారు.. గెటౌట్... అంటూ ఆయన్ని సెట్ నుంచి వెళ్లగొట్టేశారట. తెలియక చేసిన పొరపాటు వల్ల తాను ఓ మంచి అవకాశాన్ని కోల్పోయానని పృథ్వీ ఓ సందర్భంలో తన దురదృష్టా్న్ని గుర్తుచేసుకుని బాధపడ్డారు. గడ్డం తీసేసినందుకు ఓ సూపర్ హిట్ సినిమాలో హీరో ఛాన్స్ కోల్పోవడమంటే దురదృష్టం కాక మరేమంటారు. Also Read:By December 03, 2020 at 02:18PM
No comments