Breaking News

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన కౌన్సిలర్.. దారుణం


మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి, బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారం చేశాడంటూ బాధితురాలు బీజీపీ కౌన్సిలర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ అతని స్నేహితుడితోనూ శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేశాడని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్‌లోని జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. జిల్లాలోని బల్టోరా ఏరియాకి చెందిన మహిళకు నాలుగేళ్ల కిందట వివాహమైంది. ఆమె కుటుంబానికి దూరపు బంధువైన బీజేపీ కౌన్సిలర్ కాంతిలాల్ తరచూ ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో ఆమె స్నానం చేస్తుండగా కాంతిలాల్ వీడియో తీసి బెదిరించడం మొదలుపెట్టాడు. బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తన ఫ్రెండ్‌తోనూ శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేశాడు. అతని స్నేహితుడు కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరించి తనపై పలుమార్లు రేప్ చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా సంచలనంగా మారిన ఈ కేసులో మెడికల్ రిపోర్టులు వచ్చిన అనంతరం నిందితులను అరెస్టు చేసే అవకాశం ఉంది. Also Read:


By December 09, 2020 at 09:02AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/councillor-films-bathing-woman-rapes-her-after-blackmailing-in-rajasthan/articleshow/79636358.cms

No comments