Breaking News

దేశంలో 70 శాతం మంది టీకా తీసుకోవడానికి ఇష్టపడటం లేదా? సర్వే ఏంచెబుతోంది


కరోనా వైరస్‌కు టీకా విషయంలో భారతీయుల అభిప్రాయం ఎలా ఉంది? ఎంత మంది టీకా తీసుకోడానికి అనుకూలంగా ఉన్నారు? వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వేయించుకుంటారా? అనే అంశాలపై నిర్వహించిన సర్వేల్లో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి పది మంది భారతీయుల్లో ముగ్గురు మాత్రమే వేయించుకోడానికి సుముఖంగా ఉన్నట్టు తాజాగా ఓ సర్వేలో తేలింది. అంటే కేవలం 30 శాతం మంది మాత్రమే టీకా తీసుకోడానికి అనుకూలంగా ఉంటే, 70 శాతం మంది తాము టీకా తీసుకోమని చెప్పడం గమనార్హం. అలాగే 53 శాతం మందికి టీకా గురించి ఆందోళన చెందుతున్నట్టు మరో సర్వేలో వెల్లడయ్యింది. పోలియో, ఫ్లూ మొదలైన అనేక వ్యాక్సిన్ల విషయంలో భారత ఆరోగ్య అధికారులు గతంలో ఎదుర్కొన్న సంఘటనలు ప్రస్తుతం కోవిడ్ టీకాలోనూ కనిపిస్తోంది. టీకా విషయంలో అయిష్టతకు మహమ్మారి తీవ్రస్థాయి దాటిపోవడం వల్ల‘భారతీయులలో హెర్డ్ ఇమ్యూనిటీ’వచ్చిందని, ‘వ్యాక్సిన్ దుష్ప్రభావాలు’వంటి కారణాలను ఉదహరణగా పేర్కొన్నారు. ‘టీకా తీసుకోడానికి అయిష్టంగా ఉన్నవారి సంఖ్య మాత్రం ఒక నెల తగ్గి మరో నెల పెరగడం విశేషం. అక్టోబరులో వీరు 61 శాతం ఉండగా.. నవంబరు నాటికి 59కి చేరుకోగా.. డిసెంబరులో ఇది 69 శాతం ఉంది’ అని ఈ సర్వే నిర్వహించిన లోకల్ సర్కిల్స్ అధికారి సచిన్ తపారియా అన్నారు. ‘టీకా విషయంలో సందేహం కోవిడ్ కేసుల తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. జాతీయస్థాయిలో రోజువారీ సగటు కేసుల సంఖ్య 50వేల నుంచి 25 వేలకు తగ్గడం.. టీకా దుష్ప్రభావాలు, సమర్థత గురించి ఆందోళనలతో కలిపినప్పుడు.. వ్యాక్సిన్ గురించి సందేహాన్ని తెలియజేస్తుంది’అని అన్నారు. ఇక,జీఓక్యూఐఐ అనే ఫిటినెస్ టెక్నాలజీ సంస్థ నిర్వహించిన మరో సర్వేలో 53 శాతం మందికి కోవిడ్-19కు టీకా తీసుకోవడం గురించి తెలియదు (ఫలితాలను చూసిన తర్వాత 43శాతం మంది తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పగా, 10 శాతం మంది దీనికి వ్యతిరేకంగా ఉన్నారు).


By December 18, 2020 at 07:09AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/only-three-of-every-10-indians-want-to-take-the-covid-19-vaccine-says-survey/articleshow/79788694.cms

No comments