Breaking News

ఆన్‌లైన్ రమ్మీలో రూ.70 లక్షలు ఫట్.. అవాక్కైన పోలీసులు!!


ఆన్‌లైన్ రమ్మీ మోజులో ఏకంగా రూ.70 లక్షలు సమర్పించుకున్నాడో జూదగాడు. తీరా తప్పు తెలుసుకుని పోలీసులను ఆశ్రయించినా చేసేదేమీ లేదని చెప్పడంతో కంగుతిన్నాడు. రాష్ట్రంలో ఆన్‌లైన్ రమ్మీ నిషేధంలో ఉండడమే అందుకు కారణమట. ప్రాథమిక సమాచారం మేరకు.. అంబర్‌పేటకి చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్ రమ్మీలో రూ.70 లక్షలు పోగొట్టుకున్నాడు. లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అయితే రాష్ట్రంలో ఆన్‌లైన్ రమ్మీ నిషేధం ఉండగా ఎలా ఓపెన్ అయిందంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా విచారణ చేపట్టడంతో షాకింగ్ విషయం బయటపడింది. బాధితుడు ఫేక్ జీపీఎస్ యాప్ ద్వారా లాగిన్ అయినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులే అవాక్కయ్యారు. హైదరాబాద్‌లో ఉంటూ యాప్ ద్వారా వేరే రాష్ట్రాలలో ఉన్నట్లుగా చూపించి లాగిన్ అవుతున్నట్లు తెలిసింది. ఫేక్ జీపీఎస్‌తో ఆడినట్లు తేలడంతో కేసు నమోదు చేయలేమంటూ పోలీసులు తేల్చిచెప్పారు. రెండు ఐడీలతో బాధితుడు రెండేళ్లుగా ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతున్నాడు. అప్పులు చేసి ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెడుతూ వస్తున్నాడు. రేపోమాపో లాభాలొస్తాయంటూ అందులో పెట్టుబడులు పెడుతూ ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. నిజానికి ఆన్‌లైన్‌ జూదానికి సంబంధించిన గేమ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం 2017లోనే నిషేధం విధించింది. దీంతో రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ ఓపెన్‌ కాదు. రాష్ట్రంలో ఈ గేమ్‌ ఆన్‌లైన్‌లో ఓపెన్‌ కాకపోవడంతో నకిలీ జీపీఎస్‌ యాప్‌లను వాడుతున్నారు. Also Read: యాప్‌ల సహకారంతో హైదరాబాద్‌లో ఉంటూ లోకేషన్‌ను బెంగుళూరు, ముంబైలో ఉన్నట్లు సెల్‌ఫోన్‌లో చూపించడంతో గేమ్‌ ఓపెన్‌ అవుతుంది. ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆన్‌లైన్‌ జూదం ఆడి పలువురు మోసపోతున్నారు. నకిలీ జీపీఎస్‌లను ఉపయోగించి ఆన్‌లైన్‌లో రమ్మీ అడితే ఎలాంటి చర్యలు తీసుకోలేమని సైబర్‌క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. Read Also:


By December 09, 2020 at 11:54AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-loses-rs-70-lakh-in-online-gambling-in-hyderabad/articleshow/79638777.cms

No comments