Breaking News

వైద్యశాస్త్ర అద్భుతం.. 27 ఏళ్ల కిందట సేకరించిన పిండంతో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ


ఆధునిక వైద్యశాస్త్రం మరో అద్భుతం చేసింది. 27 ఏళ్ల కిందట సేకరించిన పిండం సాయంతో ఓ బిడ్డకు జన్మనిచ్చిన అరుదైన ఘటన చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన టీనా, బెన్ గిబ్స‌న్ దంప‌తులు అక్టోబ‌ర్ 26న ఓ పాపకు జన్మనివ్వగా.. 27 ఏళ్ల కిందట సేకరించిన పిండంతో బిడ్డకు జన్మనిచ్చినట్టు టెన్నెసిసీ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు వెల్లడించారు. ఆ పాపకు మొల్లి ఎవ‌రెట్ గిబ్స‌న్ అని పేరు పెట్టారు. ఈ పిండాన్ని 1992లో సేకరించి క్రయోజెనిక్ ఫ్రీజర్‌లో భద్రపరిచారు. దాదాపు, 27 ఏళ్ల పాటు శీత‌లీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఆ పిండాన్ని.. కృత్రిమ విధానంలో టీనా గ‌ర్భాశ‌యంలోకి ప్రవేశపెట్టారు. గతంలోనూ టీనా ఇదే త‌ర‌హాలో ఆడ శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. 2017లో ఎమ్మా వ్రెన్ గిబ్స‌న్‌‌కు జన్మనిచ్చిన టీనాకు..24 ఏళ్ల కిందటి సేకరించిన పిండాన్ని వినియోగించారు. మొల్లి, ఎమ్మాలు జన్యుప‌రంగా అక్కాచెల్లెళ్లు కాగా.. ఈ ఇద్ద‌రి పిండాల‌ను 1992లో డోనేట్ చేశారు. అప్ప‌టి నుంచి ఒకే ద‌గ్గ‌ర ఆ పిండాల‌ను భద్రపరిచారు. అద్దె పిండాల‌తో ఇద్ద‌రు అమ్మాయిల‌కు జ‌న్మ‌నిచ్చిన టీనా.. మొల్లి గిబ్స‌న్ క‌న్నా ఏడాది ముందు జ‌న్మించ‌డం విశేషం. ఎంబ్రియో అడాప్ష‌న్ విధానంలో గిబ్స‌న్ దంప‌తుల‌కు కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఐవీఎఫ్ చేసుకునేవారు.. అద‌నంగా పిండాల‌ను ‌దానం చేయాల్సి ఉంటుంది. అయితే పిల్ల‌లు కాని వారు, ఆ పిండాల‌ను ద‌త్త‌త తీసుకుంటారు. కానీ అప్ప‌టి వ‌ర‌కు ఆ పిండాల‌ను మైన‌స్ ఉష్ణోగ్ర‌త‌ల్లో ఫ్రీజ్ చేస్తారు. అయితే, కొంత మంది జంటలు వారి పిండాలను దానం చేయడానికి ఇష్టపడరు ఎందుకంటే వారు వయసు మళ్లినవారమని భావిస్తారని టెన్నెసిసీకి చెందిన నేషనల్ ఎంబ్రియో డొనేషన్ సెంటర్ మెడికల్ డైరెక్టర్ జెఫ్రీ కెన్ననీ అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టీనా గర్భంలోని ఈ పిండాలను ఐవీఎఫ్ విధానంలో ప్రవేశపెట్టారు. తొమ్మిది నెలలు నిండిన తర్వాత అక్టోబరు 26న ఆడపిల్లకు టీనా జన్మనిచ్చింది. పిల్లల కోసం ఎదురుచూస్తున్న గిబ్సన్.. తొలిసారిగా 2016లో ఎన్‌ఈడీసీని సంప్రదించినట్టు జెఫ్రీ తెలిపారు. ఎంబ్రియో అడాప్షన్ విధానానికి తొలుత అంతగా ఆసక్తిచూపకపోయినా.. వైద్యుల నచ్చజెప్పడంతో అంగీకరించారు.


By December 05, 2020 at 12:53PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-women-blessed-baby-from-27-year-old-frozen-embryo-breaks-record/articleshow/79578879.cms

No comments