Breaking News

2020 మ్యూజికల్ జర్నీ.. సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొట్టిన తెలుగు పాటలివే..!


2020 ఆరంభంలోనే టాలీవుడ్‌లో రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు. 'సరిలేరు నీకెవ్వరు' అంటూ మహేష్ బాబు, 'అల.. వైకుంఠపురములో' అల్లు అర్జున్ తెలుగు ప్రేక్షకులకు కిక్ స్టార్ట్ ఇచ్చారు. కానీ ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. ఊహించని విధంగా కరోనా మహమ్మారి చేసిన దాడికి సినీ ఇండస్ట్రీ విలవిలలాడిపోయింది. ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో షూటింగ్స్, థియేటర్స్ అన్నీ బంద్ అయ్యాయి. దాదాపు 8 నెలలపాటు పూర్తి స్థాయిలో సినీ కార్యకలాపాలేవీ జరగలేదు. కాబట్టి 2020 అనేది సినీ పరిశ్రమకు పీడకల అనే చెప్పుకోవాలి. కొత్త సినిమాల విడుదల సంగతి అటుంచితే సంగీతం పరంగా 2020 సూపర్ సక్సెస్ అయింది. 2020 టాలీవుడ్ మ్యూజికల్ జర్నీలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యంగా చూస్తే ఈ ఏడాదంతా 'అల.. వైకుంఠపురములో' పాటల జోరు నడించింది. ఎక్కడ చూసినా థమన్ బాణీలే వినిపించాయి. తెలుగు శ్రోతలు ఈ పాటలకు నీరాజనం పలకడంతో న్యూ ఫీట్స్ అందుకున్నాయి. అయితే వీటితో పాటు మరికొన్ని పాటలు 2020 మ్యూజికల్ జర్నీలో హైలైట్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. 1. మెలోడీ హిట్.. 'సామజవరగమన' 'అల.. వైకుంఠపురములో' మూవీ నుంచి 'సామజవరగమన' పాటతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త సంచలనానికి నాంది పలికారు. విడుదలైన రోజు నుంచే ఈ సాంగ్ వేగంగా వ్యూస్ రాబడుతూ అరుదైన రికార్డులు సృష్టించింది. ఈ మెలోడీ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించగా థమన్ బాణీలు కట్టారు. సీతారామ శాస్త్రి అందించిన లిరిక్స్‌ పాటకు ప్రాణం పోశాయి. సోషల్ మీడియాలో 1 మిలియన్ లైక్స్ పొందిన తొలి వీడియోగా రికార్డు నమోదు చేసిన ఈ సాంగ్ నేటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. 2. 'బుట్ట బొమ్మ'కు తిరుగే లేదు అదే అల్లు అర్జున్, అదే 'అల.. వైకుంఠపురములో' మూవీలోని మరో పాట 'బుట్ట బొమ్మ'తో రికార్డులు తిరగరాశారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో కాస్త నెమ్మదిగా ఆరంభమై ఇప్పుడు దుమ్ము దులుపుతోంది ఈ సాంగ్. దీంతో 2020 చివరి వరకు వచ్చేసరికి మ్యూజికల్ రికార్డులన్నీ ఈ 'బుట్ట బొమ్మ'కే సొంతమయ్యాయి. టిక్ టాక్‌‌లో ఖండాలు దాటి పరుగులు పెట్టిన ఈ పాట రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. సాధారణ, సెలబ్రిటీ అనే తేడా లేకుండా అంతా 'బుట్ట బొమ్మ'కు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. యూట్యూబ్ ఇండియా విభాగంగా చూస్తే బుట్టబొమ్మ టాప్ 3 స్థానాన్ని సంపాదించుకుంది. మరోవైపు అమెజాన్, జియో సావన్ యాప్‌లలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. 3. 'రాములో రాములా' అంటూ ఆగం చేసేసిన బన్నీ.. 'రాములో రాములా.. నన్నాగం చేసిందిరో' అంటూ మరో పాటతో హూషారెత్తించారు అల్లు అర్జున్. ఈ పాట కూడా 'అల.. వైకుంఠపురములో' మూవీ లోనిదే. ఈ సాంగ్‌లో బన్నీ హాఫ్ కోట్ స్టెప్ బాగా హైలైట్ అయింది. క్లాస్ ఆడియన్స్‌ని చూపుతిప్పకుండా చేస్తూనే మాస్ బీట్ ఇస్తూ థమన్ మ్యాజిక్ చేశారు. ఈ సాంగ్ యావత్ ప్రేక్షకలోకంలో ఓ ఊపు తెప్పించింది. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడిన ఈ పాట అతి తక్కువ కాలంలో యూ ట్యూబ్‌లో 200 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. 4. నీలి నీలి ఆకాశం సూపర్ హిట్ యాంకర్ ప్రదీప్ హీరోగా రాబోతున్న '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమా నుంచి విడుదలైన ‘నీలి నీలి ఆకాశం..’ సాంగ్ సంగీత ప్రియుల విశేషంగా ఆకట్టుకొని మిలియన్ల కొద్ది వ్యూస్ రాబడుతోంది. సిద్ శ్రీరామ్, సునీత గానం, అనూప్ రుబెల్స్ సంగీతం యువ హృదయాలకు బాగా దగ్గరైంది. 5. మహేష్ బాబు 'మైండ్ బ్లాక్' 2020 ఆరంభంలోనే వచ్చిన మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' మూవీ నుంచి 'మైండ్ బ్లాక్' సాంగ్ భారీ ప్రేక్షకాదరణ చూరగొంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బాణీలకు మహేష్ బాబు మాస్ స్టెప్స్ ప్రేక్షకలోకాన్ని ఉర్రూతలూగించాయి. 6. నీ కన్ను నీలీ సముద్రం అంటూ మెగా మేనల్లుడు మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న 'ఉప్పెన' మూవీ నుంచి 'నీ కన్ను నీలీ సముద్రం' అంటూ వచ్చిన సాంగ్ ప్రేక్షకలోకానికి బాగా కనెక్ట్ అయింది. సూఫీ స్టైల్‌లో మొదలై పల్లెటూరు ప్రేమికుడు పాడుకునే పాటగా ట్యూన్‌ని మలచి దేవి శ్రీ ప్రసాద్ ఫుల్ సక్సెస్ అయ్యారు. శ్రీమణి రాసిన సాహిత్యం సంగీత ప్రియులను మైమరిపించింది. 7. ఆడియన్స్‌ని షేక్ చేసిన 'నాదీ నక్కిలీసు గొలుసు' ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగింది 'పలాస' మూవీ. ఈ సినిమాలోని ''నాదీ నక్కిలీసు గొలుసు'' పాట ఓ ఊపు ఊపేసింది. రఘు కుంచె మంచి మాస్ టచ్ ఇచ్చారు. ఇందులో వినిపించిన ఉత్తరాంధ్ర మాండలికం పాటకు కొత్త శోభ తేవడంతో ఈ సాంగ్ అశేష తెలుగు ప్రేక్షకులను షేక్ చేసేసింది. 8. 'మగువా.. మగువా' అంటూ రంగంలోకి వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్' నుంచి ఉమెన్స్ డే కానుకగా రిలీజ్ చేసిన 'మగువా.. మగువా' పాట మెగా అభిమానులను ఆకట్టుకోవడమే గాక యావత్ సంగీత ప్రియుల మనసు దోచుకుంది. స్త్రీ ఔనత్యం చాటుతూ రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్‌పై సిద్ శ్రీరామ్ మరోసారి మెస్మరైజ్ చేశాడు. థమన్ బాణీలు అందరికీ బాగా కనెక్ట్ అయ్యాయి. 9. రష్మిక 'పొగరు' పాట ఇక రష్మిక మందాన 'పొగరు' మూవీ నుంచి వచ్చిన ఖరాబు సాంగ్ మాస్ ఆడియన్స్‌ని యమ ఆకర్షించింది. ఈ సాంగ్ వీడియోలో హీరో దృవ సర్జా రష్మికను టీజ్ చేయడం హైలైట్ అయింది. భాస్కరభట్ల అందించిన లిరిక్స్‌పై అనురాగ్ కులకర్ణి పాడిన ఈ సాంగ్ ఈ ఏడాది బాగానే ఎంటర్‌టైన్ చేసింది. 10. 'ఏమిటో ఇది..' అంటూ నితిన్ నితిన్, కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న 'రంగ్ దే' మూవీ నుంచి 'ఏమిటో ఇది' సాంగ్ ప్రేక్షకలోకాన్ని అలరించింది. శ్రీమణి అందించిన లిరిక్స్‌పై కపిల్ కపిలన్, హరిప్రియ పాడిన ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కట్టారు. యూట్యూబ్ లో ఈ సాంగ్‌కి భారీ ఆదరణ లభించింది


By December 24, 2020 at 11:24AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/2020-top-hits-songs-in-tollywood/articleshow/79935854.cms

No comments