Breaking News

ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మందికే కోవిడ్ టీకా.. కేంద్రం మార్గదర్శకాలు


దేశంలో మరి కొద్ది రోజుల్లోనే అత్యవసర వినియోగం కింద కరోనా వైరస్‌కు టీకా అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచనలు జారీచేసింది. తొలి దశలో కరోనా యోధులు, వయసు మళ్లినవారు, అనారోగ్య సమస్యలున్నవారికి టీకా అందజేయనున్నారు. అయితే, సాధారణ టీకాల మాదిరిగా ఒక రోజులో వందలాది మందికి వ్యాక్సినేషన్ మాదిరిగా కాకుండా ఒక్కో కేంద్రంలో రోజుకు వంద మందికి మాత్రమే అందజేయనున్నట్టు ప్రభుత్వ ప్రణాళికలు సూచిస్తున్నాయి. కమ్యూనిటీ హాళ్లు, తాత్కాలిక టెంట్లను తరువాతి దశలో టీకాలు వేయడానికి ఉపయోగించనున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం టీకా వేసిన తర్వాత ప్రతికూలతలు తలెత్తితే చికిత్స చేయాల్సి ఆస్పత్రుల నుంచి, వ్యాక్సినేషన్‌కు అవసరమైన నిర్దిష్ట కేంద్రాల గుర్తింపు వరకు రాష్ట్రాలు మౌలిక సదుపాయాలను పెంచుతున్నాయి. ఒక్కో వ్యాక్సినేషన్ కేంద్రంలో ఐదుగురు అధికారులు, ఓ గార్డ్, మూడు గదులు (వెయింటింగ్, వ్యాక్సినేషన్, అబ్జర్వేషన్) ఉండాలని కేంద్రం గురువారం జారీచేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులను తప్పనిసరిగా 30 నిమిషాలు అబ్జర్వేషన్‌లో ఉండాలి. టీకా వేసుకున్న తర్వాత ఎటువంటి దుష్ప్రభావానికి గురైనా వెంటనే వారిని ముందుగా నిర్దేశించిన ఆస్పత్రికి తరలించారు. టీకా పంపిణీపై కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాప్‌లో పాల్గొన్న డాక్టర్ రజనీ అనే వైద్యురాలు మాట్లాడుతూ.. భౌతికదూరాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మూడు గదులు తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించారన్నారు. టీకా రూమ్‌లో ప్రతిసారీ ఒక వ్యక్తి మాత్రమే ప్రవేశం ఉంటుంది.. వెయిటింగ్, అబ్జర్వేషన్ రూమ్‌లో పలువురు కూర్చునేలా ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. భౌతికదూరం పరిమితుల దృష్ట్యా ప్రతి గంటకు 13-14 మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతానికి లాజిస్టిక్ అడ్డంకులు ఉన్న కేంద్రాల్లో రోజుకు 100 కంటే ఎక్కువ టీకాలు వేయరాదని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ప్రతి కేంద్రంలోని ఐదుగురు టీకా అధికారులు, జాబితాలో ఉన్న లబ్ధిదారుల పేర్లను చూసే బాధ్యత గార్డుపై ఉంటుంది. ఇతర అధికారులు ప్రభుత్వ గుర్తింపు కార్డులు, కో-విన్ యాప్‌ల తనిఖీ చేస్తారు. టీకా వేయించుకున్నవారి గోప్యతకు ప్రాధాన్యత ఇస్తారు. వ్యాక్సినేషన్ వేసే అధికారి పురుషుడై మహిళా అటెండెంట్ ఉండాలి. సురక్షితమైన వ్యాక్సినేషన్ పద్ధతులు, వ్యర్థాలను నిర్వహించడానికి ఆమె సహాయం చేస్తుంది.


By December 12, 2020 at 07:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-only-100-may-get-vaccine-jab-per-day-at-each-site-says-govt/articleshow/79689355.cms

No comments