Oxford వ్యాక్సిన్: తొలి డోసుతోనే 70% సమర్థంగా.. అదిరిపోయే న్యూస్
, మోడెర్నా, స్పుత్నిక్-వి సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కరోనా వ్యాక్సిన్లు వస్తున్నా.. అందరి దృష్టి ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ( Vaccine) పైనే ఉంది. ఆక్స్‌ఫర్డ్ విశ్వసనీయత, గతంలో అభివృద్ధి చేసిన టీకాలు సమర్థంగా పనిచేయడమే అందుక్కారణం. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారితో పోరులో గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆ సంస్థ శుభవార్త అందించింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ () తొలి డోసుతోనే 70.4 శాతం ప్రభావవంతంగా పనిచేసింది. ఇక రెండు డోసు కూడా ఇస్తే.. 90 శాతం వరకూ సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు.. కొత్తగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ 90% సమర్థత కనబరచడం చాలా అరుదైన విషయమని చెప్తున్నారు. ఇప్పటివరకు కొత్తగా వచ్చిన వ్యాక్సిన్లు కేవలం 70 శాతం సమర్థతను మాత్రమే ప్రదర్శించాయి. Must Read: ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందిస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ తుది దశకు చేరుకున్నాయి. మూడో దశ ప్రయోగాల మధ్యంతర ఫలితాలను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తాజాగా ప్రకటించింది. తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా తొలి డోసు తీసుకున్న వారిలో 70.4% సమర్థత కనబరచినట్లు వెల్లడించింది. వివిధ వాలంటీర్ల నుంచి సేకరించిన ప్రయోగాల వివరాల ప్రకారం.. వ్యాక్సిన్ సమర్థత సరాసరిగా 70 శాతానికి పైగా ఉంటుందని ఆక్స్‌ఫర్డ్ నమ్మకంగా చెబుతోంది. తీవ్రమైన కొవిడ్-19 వ్యాధి బారి నుంచి ఈ వ్యాక్సిన్ పూర్తి రక్షణ కల్పిస్తుందని హామీ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 23,000 మంది వాలంటీర్లపై ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. అందరి వాలంటీర్లకు సంబంధించిన సమాచారాన్నంతా సేకరించి మరోసారి సమీక్ష చేయనున్నారు. విశ్లేషణ కోసం వివరాలు అందుబాటులో ఉంచనున్నట్లు ఆక్స్‌ఫర్డ్ తెలిపింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్’ ట్రయల్స్ అతి త్వరలో విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీకి కూడా సన్నాహకాలు మొదలయ్యాయి. ఒక్క 2021 సంవత్సరంలోనే 300 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆక్స్‌ఫర్డ్ తెలిపింది. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు ప్రత్యేక ఫ్రీజర్లు అవసరం లేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. సాధారణ రిఫ్రిజిరేటర్లలోనే టీకాను నిల్వచేసుకోవచ్చని వెల్లడించింది. ఎమర్జెన్సీ కేసుల్లో వ్యాక్సిన్‌ను అత్యవసరంగా అందించడానికి అనుమతుల కోసం ఆక్స్‌ఫర్డ్ కసరత్తు ప్రారంభించింది. Also Read: Must Read:
By November 23, 2020 at 04:29PM
No comments