Breaking News

Mahesh Babu: థాయ్‌లాండ్‌లో మహేష్ బాబు అలా..! కమలాయ ఎఫెక్ట్ అంటున్న నమ్రత


కరోనా మహమ్మారి దాడితో దేశం మొత్తం అతలాకుతలమైంది. అన్ని రంగాలపై కరోనా ప్రభావం పడింది. దాదాపు నాలుగు నెలల పాటు ఏ ఒక్కరూ గడపదాటి బయటకురాని పరిస్థితి చూశాం. ఆ తర్వాత నెమ్మదిగా లాక్‌డౌన్ సడలింపులు వస్తుండటంతో ప్రజలంతా ఎవరి పనిలో వారు నిమగ్నమవుతున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ పాత ఫోటో షేర్ చేసి సర్‌ప్రైజ్ చేశారు ఆయన సతీమణి . కరోనాకి ముందు సమ్మర్‌ వెకేషన్‌కి వెళ్లినప్పటి ఫొటో ఇది అని పేర్కొన్నారు. పాత ఫోటోనే అయినా రేర్ పిక్ కావడంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అయింది. పైగా ఈ పిక్‌లో టోపీ పెట్టుకుని.. చాలా సంతోషంగా కనిపిస్తున్న మహేష్ డిఫరెంట్ లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గతంలో ఎప్పుడూ మహేష్‌ని‌ ఇలా కనిపించకపోవడంతో ఈ పిక్ చూసి తెగ మురిసిపోతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. థాయ్‌లాండ్‌లోని కమలాయ రిసార్ట్, అందులోని స్పా అంటే మహేష్‌ బాబుకు ఎంతో ఇష్టమని తెలుపుతూ ఈ రేర్ ఫోటో షేర్ చేశారు నమ్రత. ఈ మేరకు ప్రీ కోవిడ్ డైరీస్ అనే హ్యాష్ ట్యాగ్ జతచేశారు. Also Read: ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరూ' మూవీతో సక్సెస్ అందుకున్న ఆయన మరికొద్ది రోజుల్లో 'సర్కారు వారి పాట' సినిమా రెగ్యులర్ షూట్‌లో పాల్గొనబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


By November 01, 2020 at 10:25AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-rare-photo-shared-by-namrata-shirodkar/articleshow/78978428.cms

No comments