Breaking News

దశావతారం, నాన్నకు ప్రేమతో.. ఈ రెండు సినిమాలకు లింకేంటో తెలుసా?


ఏదైనా సినిమాలో హీరో రెండు మూడు పాత్రల్లో నటిస్తేనే ఫ్యాన్స్ అబ్బురంగా చెప్పుకుంటారు. కానీ విశ్వనటుడు కమల్‌ హాసన్ అయితే ‘’ సినిమాలో ఏకంగా పది పాత్రల్లో నటించి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. మరోవైపు తండ్రిపై అమితమైన ప్రేమ కలిగిన ఓ కొడుకు ఆయన చివరి కోరిక తీర్చడం కోసం ఓ బిలియనీర్‌తో పోటీపడి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలిపే పాత్రలో ఎన్టీఆర్ ‘’ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఏంటి ఈ రెండు సినిమాలకు ఒకదానికొకటి సంబంధం లేదు కదా.. పొరపాటుగా మాట్లాడుతున్నామనుకుంటున్నారా?. అలాంటిదేమీ లేదు.. ఈ రెండు సినిమాలకు ఓ పోలిక ఉంది. దాని గురించే ఇప్పుడు చెప్పుకుందాం... ఈ రెండు చిత్రాల కథ వేరు, నేపథ్యం వేరు సంబంధం ఏంటి అనుకుంటున్నారా?.. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ రెండు చిత్రాల్లోనూ మనకు సీతాకోకచిలుకలు కనిపిస్తాయి. ఎందుకంటే ‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌’ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాలు తెరకెక్కించారు. కేవలం బటర్‌ ఫ్లైస్‌ వల్ల జరిగితేనే అది ‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌’ కాదు. ఎక్కడో జరిగిన ఓ చిన్న సంఘటన మరెక్కడో పెద్ద సంఘటన జరిగేందుకు దారితీయగలదు. ఈ నేపథ్యంలోనే ఈ రెండు సినిమాలు తెరకెక్కాయి. Also Read: ‘దశావతారం’లో ఈ ప్రస్తావన ఎక్కువగా లేకపోయినా అంతర్లీనంగా దర్శనమిస్తుంది. ‘నాన్నకు ప్రేమతో’లో హీరో ఎన్టీఆర్‌.. హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్‌కు దీని గురించి వివరిస్తాడు. ఇలా విభిన్న కథాంశంతో ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రాల రికార్డు ఏంటంటే? ‘బటర్‌ ఫ్లై ఎఫెక్ట్‌’ కాన్సెప్ట్‌ తెరకెక్కిన తొలి భారతీయ సినిమా ‘దశావతారం’, రెండో చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. ఈ రెండు సినిమాలు దక్షిణాదివే కావడం మరో విశేషం. ఇతర భాషల సినీ ఇండస్ట్రీల కంటే అన్ని విధాలా ఎంతో ముందున్నామని గొప్పలు చెప్పుకునే బాలీవుడ్‌ మాత్రం ఇప్పటివరకు ఈ నేపథ్యంలో ఒక్క సినిమా కూడా తెరకెక్కించలేకపోయింది.


By November 05, 2020 at 08:32AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/dasavatharam-and-nannaku-prematho-movies-make-with-butterfly-concept/articleshow/79053417.cms

No comments