స్ఫూర్తిదాయక చిత్రం... ‘ఆకాశం నీ హద్దురా’పై మహేశ్‌బాబు ప్రశంసలు
కథానాయకుడిగా, సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘’. ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. సూర్య అద్భుతమైన నటన, సుధా కొంగర టేకింగ్‌కు ప్రేక్షకులతో పాటు ప్రముఖులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ సోషల్‌మీడియా ద్వారా ప్రశంసిస్తున్నారు.
రీసెంట్‌గా ఈ సినిమా చూసిన సూపర్‌స్టార్ ‘ఆకాశం నీ హద్దురా’ టీమ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ‘సూరరై పోట్రు(ఆకాశం నీ హద్దురా) స్ఫూర్తిదాయకమైన చిత్రం. బ్రిలియంట్ డైరెక్షన్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్, సూర్య టాప్ రేంజ్‌లో నటించాడు. ఎంటైర్ టీమ్‌కు అభినందనలు’ అంటూ మహేశ్ ట్వీట్ చేశారు. సూపర్‌స్టార్ ప్రశంసలకు మురిసిపోయిన సూర్య ఆయనకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘మా సినిమాపై ప్రశంసలు కురిపించిన మహేశ్‌కు ధన్యవాదాలు. ‘సర్కారువారి పాట’ సినిమా కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. Also Read:By November 19, 2020 at 11:11AM
No comments