Breaking News

నెల్లూరు మార్కెట్లో పట్టపగలు కత్తులతో హల్‌చల్... ప్రజలు బెంబేలు.. సీన్ కట్ చేస్తే


అది . నిత్యం వ్యాపారులు, వినియోగదారులతో రద్దీగా ఉంటుంది. అలాంటి చోట శనివారం కొందరు వ్యక్తులు కత్తులతో హల్‌‌చల్ చేశారు. కొందరిని వెంబడిస్తూ కత్తులతో పొడుస్తుంటే.. మరికొందరేమో పిడిగుద్దులు కురిపించుకుంటూ పరుగులు తీశారు. ఊహించని విధంగా జరిగిన ఈ గ్యాంగ్ వార్‌తో అక్కడి వారంతా బెంబేలెత్తిపోయారు. అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. Also Read: కొద్ది క్షణాల్లోనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ గ్యాంగ్ వార్‌లో పాల్గొన్నవారందరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా షాకింగ్ విషయం బయటపడింది. అది గ్యాంగ్ వార్ కాదని.. తామంతా జూనియర్ ఆర్టిస్టులమని, ఓ సినిమా షూటింగ్ నిమిత్తం అలా నటిస్తున్నామని చెప్పి పోలీసులకు షాకిచ్చారు. దీంతో ఒళ్లు మండిన పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. Also Read: అక్కడ యూనిట్ సభ్యులను తమదైన శైలిలో పోలీసులు విచారించగా గుట్టు మొత్తం బయటపెట్టారు. ‘మద్రాస్ బస్టాండ్‌’ పేరుతో తాము ఓ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నామని, ఆ షూటింగులో భాగంగానే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పడంతో పోలీసులు చీవాట్లు పెట్టారు. ఎక్కడ షూటింగ్ తీసుకున్నా ఆ ఏరియా పోలీసుల అనుమతి తీసుకోవాలని, ప్రజలకు కూడా సరైన అవగాహన కల్పించిన తర్వాతే షూటింగ్ చేసుకోవాలన్న విషయం తెలియకుండా ఇలా చేయడమేంటని పోలీసులు వారిని మందలించారు. యూనిట్ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చేతిలో కెమెరా ఉంది కదా అని అనుమతి తీసుకోకుండా ఎక్కడపడితే అక్కడ షూటింగులు తీస్తూ ప్రజలను ఇబ్బంది పెడితే తాట తీస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


By November 22, 2020 at 07:59AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nellore-police-arrests-people-making-short-film-in-market-yard-without-permission/articleshow/79347596.cms

No comments