Breaking News

సైనికుల మధ్య మోదీ దీపావళి వేడుకలు.. పాక్, చైనాలకు పరోక్షంగా హెచ్చరికలు


ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏటా దీపావళి పండుగను దేశ సరిహద్దుల్లో సైనికుల మధ్య జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయాన్నే కొనసాగించారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొండలు, ఎడారిలో నివసిస్తోన్న సైనికులతో తాను దీపావళి జరుపుకుంటున్నానని అన్నారు. భద్రతా బలగాలకు భారతీయుల తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాని చెప్పారు. సైనికుల ముందకు ప్రతి భారతీయుడి శుభాకాంక్షలు తీసుకొచ్చానని అన్నారు. వీర మరణం పొందిన సైనికులకు నివాళులర్పిస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు. సైనికుల మధ్యకు వచ్చినప్పుడు తనకు అసలైన దీపావళిని జరుపుకుంటున్నట్లు అనిపిస్తుందని పేర్కొన్నారు. సైనికులు ఉత్సాహంగా ఉంటేనే దేశ ప్రజలు ఉత్సాహంగా ఉంటారని మోదీ ఉద్ఘాటించారు. వారు సంతోషంగా ఉంటనే పండుగైనా, దేశమైనా అని అన్నారు. దేశాన్ని రక్షించే సైనికులను చూసి యావత్ భారతావని గర్వపడుతోందని ప్రధాని అన్నారు. ఆక్రమణదారులు, ఉగ్రవాదులను ఎదుర్కొనే ధైర్యం సైనికులను ఉందని చెప్పారు. ఉగ్రవాదులను భారత్ అంతమొందిస్తోందని చెప్పారు. మన సైన్యం ముందు ఉగ్రవాదుల ఆటలు సాగవని, దేశ భద్రత విషయంలో భారత్ రాజీపడబోదని ప్రపంచం యావత్తు నేడు గుర్తిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ వేడుకల్లో త్రివిధ దళాల చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే తదితరులు పాల్గొన్నారు. ఇతరులను అర్ధం చేసుకోవడం మా విధానం.. మా సహనాన్ని పరీక్షించాలని చూస్తే సరైన సమాధానం చెప్తామని పరోక్షంగా పాకిస్థాన్, చైనాలకు హెచ్చరికలు చేశారు. మనలో ధైర్యసాహసాలే ముందుకు నడిపిస్తాయని పేర్కొన్నారు. రాబోయే తరాలు జవాన్ల త్యాగాలను గుర్తుంచుకుంటాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా 1971 ఇండియా-పాక్ యుద్ధంలో వీరోచిత పోరాటం చేసి అమరుడైన బ్రిగేడియర్ కుల్‌దీప్ సింగ్ చంద్‌పురి స్మారకం వద్ద నివాళలర్పించారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో భారత సైన్యం దెబ్బంటో పాకిస్థాన్ రుచిచూసిందన్నారు. విస్తరణవాదంతో ప్రపంచ మొత్తం ఇబ్బందులను ఎదుర్కొంటోందని పరోక్షంగా చైనాకు చురకలంటించారు. ప్రపంచం మొత్తం "విస్తరణవాద" శక్తులతో ఇబ్బంది పడుతుందని, విస్తరణవాదం 18 వ శతాబ్దానికి చెందిన ‘వక్రీకృత మనస్తత్వాన్ని’ చూపిస్తుంది అన్నారు.


By November 14, 2020 at 01:07PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-lauds-valor-of-jawans-targets-pakistan-and-china-in-diwali-address/articleshow/79221342.cms

No comments