Breaking News

కరెన్సీ నోట్ల దండతో హీరోయిన్‌ హంగామా... బ్రేక్ కోసం నానా పాట్లు


శేఖర్ కమ్ముల, దగ్గుబాటి రానా కాంబినేషన్లో వచ్చిన ‘లీడర్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది చెన్నై బ్యూటీ . ఈ విజయం సాదించడంతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. రామ్ హీరోగా వచ్చిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ , సిద్దార్థ్ హీరోగా వచ్చిన ‘180’, శర్వానంద్ హీరోగా వచ్చిన ‘కో అంటే కోటి’ వంటి క్రేజీ చిత్రాల్లో నటించింది. ఆ సినిమాలన్నీ యావరేజ్‌గా ఆడటంతో ప్రియాకు ఛాన్సులు తగ్గాయి. టాలీవుడ్‌లో తనను ఎవరూ పట్టించుకోకపోవడంతో తమిళం, కన్నడ పరిశ్రమల్లోకి వెళ్లి బాగానే క్లిక్ అయింది. మీడియం రేంజ్ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ బాగానే ఆకట్టుకుంది. అయితే కొత్త హీరోయిన్ల రాకతో అక్కడా ఈ అమ్మడికి ఛాన్సులు తగ్గాయట. దీంతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఛాన్స్ దొరికితే తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ గతంలోనే చెప్పింది. సాధారణంగా ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉండే ప్రియా ఆనంద్ అవకాశాల కోసం ఇప్పుడు రూటు మార్చింది. వరుస ఫోటో షూట్లతో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే కింద ప్యాంట్ వేసుకోకుండా మెడలో కరెన్సీ నోట్ల దండతో ఫోటోలు దిగి వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. గ్లామర్ విషయంలో తాను కూడా తగ్గేది లేదని సింబాలిక్‌గా చెప్పేందుకు ప్రియా ఇలా చేస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పుడైనా ఈ చెన్నై బ్యూటీకి తెలుగులో బ్రేక్ వస్తుందో లేదో చూడాలి.


By November 25, 2020 at 08:38AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-priya-anand-latest-pics-goes-viral/articleshow/79400745.cms

No comments