Breaking News

ఎట్టకేలకు మనసు మార్చుకున్న ట్రంప్.. అధ్యక్ష బాధ్యతల బదలాయింపునకు ఓకే


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బిడెన్‌కు అధికార బాధ్యతలను బదలాయించడానికి ఎట్టకేలకు అంగీకరించారు. ఇందుకు సంబంధించి జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (జీఎస్ఏ) అవసరమైన చర్యలు చేపట్టడానికి ట్రంప్ సమ్మతించారు. బిడెన్ టీం వైట్ హౌస్‌లోకి వచ్చే ప్రక్రియకు ఆయన అంగీకారం తెలిపారు. బిడెన్ టీంకు సహకారం అందిస్తామన్నారు. కానీ తన ఓటమిని మాత్రం ట్రంప్ అంగీకరించకపోవడం గమనార్హం. తమ పోరాటం బలంగా కొనసాగుతుందని ట్రంప్ చెప్పారు. అధికార బదలాయింపునకు ట్రంప్ అంగీకరించడంతో.. నిధులు, ఆఫీసు స్పేస్, ఫెడరల్ అధికారులతో భేటీ అయ్యేందుకు బిడెన్ టీమ్‌కు అవకాశం ఉంటుంది. అమెరికా విదేశాంగ విధానం, భద్రతా పోస్టుల్లో అత్యంత అనుభవం ఉన్నవారిని నామినేట్ చేస్తామని బిడెన్ ఆఫీస్ ప్రకటించింది. అధికార బదలాయింపు సజావుగా సాగడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జీఎస్ఏను కోరింది. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత.. బిడెన్ విజయం ఖాయమైంది. కానీ ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, తాను ఓటమిని అంగీకరించబోనని ప్రకటించిన ట్రంప్.. న్యాయస్థానాలను ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో మనసు మార్చుకున్నారు.


By November 24, 2020 at 10:29AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-president-donald-trump-finally-agrees-to-joe-biden-transition/articleshow/79382307.cms

No comments