Breaking News

నేరుగా గుండె కండరాలపై దాడిచేస్తోన్న కరోనా.. కొత్తగా హృదోగ సమస్యలు!


కరోనా వైరస్‌ శ్వాసవ్యవస్థపై దాడిచేస్తుంది కాబట్టి దాని ప్రభావం ఊపిరితిత్తులపైనా, ఫలితంగా గుండెపైనా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, మహమ్మారి నేరుగా గుండె కండరాలపైనా దాడిచేసి, పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్టు తాజా పరిశోధనలో వెల్లడయ్యింది. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల ప్రకారం.. కరోనా వైరస్‌ తొలుత ఊపిరితిత్తులపై దాడి చేయడంతో గుండెకు సరిపడినంత ఆక్సిజన్‌ అందక పని తీరు దెబ్బతింటుందని తేల్చాయి. కానీ, చికాగో యూనివర్సిటీ శాస్త్రవేత్తల తాజా పరిశోధన ప్రకారం వైరస్‌ నేరుగా గుండెతోపాటు రక్తనాళాలపై దాడి చేయడం వల్ల రక్తం గడ్డ కట్టే ప్రమాదమూ ఉందని పరిశోధకులు పేర్కొన్నాయి. Read Also: కొంతమంది కరోనా బాధితుల శరీరంలో చాలా చోట్ల రక్తం గడ్డకట్టుపోయినట్లు గుర్తించిన పరిశోధకులు.. అవి సోకిన తర్వాత ఏర్పడ్డాయా? అంతకు ముందు నుంచే ఉన్నాయా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు కరోనా వైరస్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త డా.సీన్‌ పిన్నేయ్ పేర్కొన్నారు. అంతేకాదు, ఎటువంటి గుండె సంబంధిత సమస్యలు లేకపోయినా కరోనా వైరస్‌ సోకిన తర్వాత వచ్చే అవకాశముందని, కొందరిలో ఆ లక్షణాలను గుర్తించామని వివరించారు. Read Also: పరిశోధన ఫలితాలను అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురించారు. తాజా అధ్యయనం ప్రకారం.. కరోనా బాధితుల్లో దాదాపు 25 శాతం మందికి గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతుండగా.. కొన్నిచోట్ల ఇది 30 శాతంగా ఉంది. కరోనా వైరస్‌ బారినపడ్డ కొందరి ఎంజైమ్‌ల స్థాయిల్లో మార్పులు చోటుచేసుకోవడం, గుండె పనితీరు మందగించడం వంటి అంశాలను గుర్తించినట్లు మరో పరిశోధనలో తేలింది. అయితే ఈ సమస్య తాత్కాలికమా? శాశ్వతమా? అన్నది తెలియాల్సి ఉంది. Read Also: కాగా, కరోనా వైరస్‌ గుండెపై నేరుగా ప్రభావం చూపుతుందనడానికి శాస్త్రవేత్తలు ఆధారాలను కూడా సేకరించారు. ఒకరు న్యుమోనియాతో చనిపోగా.. స్వల్ప లక్షణాలున్న మరో నలుగురు అథ్లెట్లల్లో గుండె కణజాలల మధ్య ఇన్‌ఫెక్షన్ చేరినట్టు స్కానింగ్‌ ద్వారా గుర్తించారు. కరోనా బారినపడక ముందు వారిలో అటువంటి లక్షణాలేమీ లేవు. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ నిపుణుడు టామ్‌ మేడాక్స్‌ వెల్లడించారు. ఈ అంశంపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. Read Also:


By November 02, 2020 at 01:10PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/how-does-coronavirus-affect-the-heart-says-chicago-university-research/articleshow/78995135.cms

No comments