కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అహ్మద్ పటేల్ కన్నుమూత


సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు (71) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందతూ తుది శ్వాసవిడిచారు. బారినపడి కోలుకున్న ఆయనకు అనారోగ్య సమస్యల వెంటాడటంతో నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మరణించారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత శరీరంలోని పలు అవయవాలు సరిగా పని చేయకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది.. దీంతో నవంబరు 15 నుంచి ఆయనకు ఐసీయూలో చికిత్స అందజేశారని ఫైసల్ తెలిపారు. అహ్మద్ పటేల్ ఎనిమిది సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మూడుసార్లు లోక్‌సభకు, అయిదు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అహ్మద్ పటేల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో ఆయన పాత్ర ఎన్నటికీ గుర్తిండిపోతుందని, తన తెలివితేటలతో ఎంతో ప్రసిద్ధి చెందారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
By November 25, 2020 at 07:15AM
No comments