Breaking News

కరోనాకు వ్యాక్సిన్ రాదు.. అది ఇప్పుడప్పుడే పోదు: బాలకృష్ణ


కరోనా వైరస్ విషయంలో అశ్రద్ధ వద్దని.. చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. ‘సెహరి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేసి చిత్ర యూనిట్‌ను శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కరోనా గురించి ప్రజలకు పలు సూచనలు చేశారు. ‘‘కరోనా సమయంలో చదువు వచ్చిన వాళ్లకి, రాని వాళ్లకు నేను ఎన్నో చెప్పాను. చాలా మంది చెప్తారు.. భక్తి ఛానెల్ అని, ఆధ్యాత్మికత అని రోట్లో వేసి దంచుతారు. బాబూ పొద్దున్నే లేచి చల్లని నీళ్లతో తలస్నానం చేయండి అని చెప్తారు. చస్తే చేయొద్దు. వాళ్ల మాటలు ఎవ్వరూ వినకండి. కరోనా అన్నది నుమోనియాకు సంబంధించినది. అదొక లిపిడ్ ప్రొటీన్. అది పరివర్తనం చెందుతూ ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు దానికి వ్యాక్సిన్ రాలేదు రాదు కూడా. నేను కచ్చితంగా చెబుతున్నాను. దాని గురించి నాకు తెలుసు. కరోనా అన్నది మనషి మనసును కన్‌ఫ్యూజ్ చేస్తుంది’’ అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. కార్తీకమాసమని దయచేసి ఎవ్వరూ పొద్దున్నే లేచి చల్లనీళ్లతో తలస్నానం చేయొద్దని బాలకృష్ణ సూచించారు. ఆరోగ్య సూత్రాలు పాటించాలని, వేడి నీళ్లతో స్నానం చేయాలని, వేడి నీళ్లతో ఆవిరి పట్టాలని, ఉప్పు నీరు లేదంటే వేడి నీళ్లతో పుక్కిలించాలని చెప్పారు. ఈ ఆరోగ్య సూత్రాలన్నీ పాటిస్తేనే అంతా బాగుంటామని అన్నారు. కరోనా పోవాల్సిన సమయం ఇంకా ఉందని.. ఇప్పుడప్పుడే అది పోదని చెప్పారు. హాస్పిటల్స్ అన్ని రోగాలకు వైద్యం అందించాలని కోరారు. ఇలాంటి కరోనా సమయంలోనూ ధైర్యంగా షూటింగ్ చేస్తున్న ‘సెహరి’ టీమ్‌ను ఆయన అభినందించారు. Also Read:


By November 16, 2020 at 11:34AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nandamuri-balakrishna-talks-about-coronavirus-in-sehari-first-look-luanch-event/articleshow/79242719.cms

No comments