షూటింగ్ మధ్యలో శృతిహాసన్ జంప్.. ఇదీ అసలు కారణం!!
కమల్‌హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ సౌత్ ఇండియన్ తెరపై భారీ పాపులారిటీ కూడగట్టుకొని ఆ తర్వాత కొన్నేళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రియుడు మైకేల్ కోర్సలేతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన శృతిహాసన్ కొన్ని రోజులపాటు సిల్వర్ స్క్రీన్‌కి దూరంగా ఉండి తిరిగి రీసెంట్‌గా కెమెరా ముందుకొచ్చింది. ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమా షూటింగుల్లో పాల్గొంటున్న శృతి.. ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగా, సెట్స్ మీదనుంచి అనూహ్యంగా బయటకు వెళ్లడం సినీ వర్గాల్లో హాట్ ఇష్యూ అయింది. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న `లాభం` అనే తమిళ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ తమిళనాడులోని ధర్మపురి, కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇందుకోసమై శృతి సెట్స్ మీదకు రాగా.. ఆయా పరిసర ప్రాంతాల నుండి ఆమెను చూడటానికి పెద్దఎత్తున జనం తరలివచ్చారట. దీంతో శృతిహాసన్ ఆ షూటింగ్‌ని మధ్యలోనే వదిలేసి జంప్ కావడమే గాక, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా చిత్రీకరణ ఎలా చేస్తున్నారంటూ యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలిసింది. Also Read: గతంతో పోల్చితే కరోనా భయం కాస్త తగ్గినా ప్రస్తుతం దేశవిదేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇదే శృతిహాసన్ అలా షూటింగ్ మధ్యలో వదిలేసి వెళ్ళడానికి కారణం అని సమాచారం. అంతమంది జనం ఒక్కచోట చేరడం చూసి కరోనా భయంతో శృతి ఆ ప్రదేశం వదిలి వెళ్లిందట. పైగా కోవిడ్-19 వల్ల ప్రతిఒక్కరి ఆరోగ్యానికి ప్రమాదం ఉంది. అది ఇంకా అంతరించిపోలేదు. కరోనా ప్రోటోకాల్స్ పాటించని పక్షంలో.. ఓ మహిళగా, నటిగా నా భద్రత కోసం జాగ్రత్తలు తీసుకునే హక్కు నాకు ఉందని ఇటీవలే శృతి పేర్కొంది. దీంతో తాజా సంఘటన చూసి శృతి చెప్పిందే చేసిందిగా అంటున్నారు జనం.
By November 24, 2020 at 12:42PM
No comments