చిరంజీవిని కలవడానికి వెళ్తే ఆయన..! అస్సలు మరువలేను.. ఓపెన్ అయిన యాంకర్ ప్రదీప్
తనదైన మాటల తూటాలతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు . ఎన్నో కార్యక్రమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. పలు సినిమా ఫంక్షన్లకు హోస్ట్‌గా కూడా వ్యవహరించిన ఆయన.. మరికొద్ది రోజుల్లో వెండితెరపై హీరోగా కూడా అలరించనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సుమ నిర్వహిస్తున్న ఓ టీవీ షోలో పాల్గొన్న ప్రదీప్.. తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని సంఘటనలను, అలాగే మెగాస్టార్‌తో మీట్ తాలూకు విశేషాలను పంచుకుంటూ ఓపెన్ అయ్యాడు. తనకు యాంకర్‌గా ఓ గుర్తింపు వచ్చాక మొదటిసారి మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి వెళ్లగా.. ఆయన తనను పేరుపెట్టి పిలుస్తూ ఎంతో ఆప్యాయత చూపించారని తెలిపాడు ప్రదీప్. ''మీ వాయిస్ నాకు చాలా ఇష్టం. మీరు పలికే తెలుగు పదాల ఉచ్చారణ నాకెంతో నచ్చుతుంది'' అని ఆయన ప్రశంసించడం ఎప్పటికీ మరచిపోలేనని అన్నాడు. తనతో మాట్లాడుతుంటే అలాగే నిల్చుండిపోయానని, ఆ సమయంలో కూర్చోండి అంటూ మెగాస్టార్ అనడం.. ఆ క్షణాలు మరవరానివాని ప్రదీప్ పేర్కొన్నాడు. Also Read: ఇన్నాళ్లు బుల్లితెరపై సందడి చేసిన యాంకర్ ప్రదీప్.. ఇకపై వెండితెర ప్రేక్షకులను కూడా అలరించబోతున్నాడు. ప్రదీప్ హీరోగా మన ముందుకు రాబోతున్న న్యూ మూవీ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ‘నీలి నీలి ఆకాశం’ పాటకు భారీ ఆదరణ లభిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు మున్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనకాడకుండా ఎస్వీ బాబు ఈ సినిమాను నిర్మించారు.
By November 23, 2020 at 01:05PM
No comments