ట్విటర్లో రామ్‌చరణ్ రికార్డు.. ఏ స్టార్‌కూ సాధ్యం కాలేదిది

మెగా పవర్‌స్టార్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు సెట్ చేశారు. ట్విటర్లో అతి తక్కువ సమయంలోనే మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న స్టార్‌గా నిలిచారు. ఈ ఏడాది మార్చి నెలలో ట్విటర్లోకి అడుగుపెట్టిన చెర్రీ కేవలం 233 రోజుల్లోనే పది లక్షల ఫాలోవర్లను సొంతం చేసుకోవడం విశేషం. దీంతో ఇంత తక్కువ సమయంలోనే ఈ రికార్డును సాధించిన తెలుగు స్టార్‌గా ఆయన నిలిచారు. తనపై సినిమాలతో పాటు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను చరణ్ ట్విటర్ ద్వారా షేర్ చేస్తుంటారు. అయితే ఆయన్ని 10 లక్షల మంది ఫాలో అవుతున్నప్పటికీ చరణ్ మాత్రం కేవలం ఇద్దరిని మాత్రమే ఫాలో అవుతున్నారు. వారు తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్. రామ్‌చరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. దీంతో పాటు చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’లోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. Also Read:
By November 10, 2020 at 07:32AM
No comments