Breaking News

Bihar Election Vote Counting కాసేపట్లో ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు


బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 243 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగ్గా... ఫలితాలపై యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మహాకూటమికే బిహార్ ప్రజలు పట్టం కట్టనున్నారనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? నితీశ్ మళ్లీ హ్యాట్రిక్ సాధిస్తారా? అనేది తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. తర్వాత ఈవీఎంల ఓట్లను లెక్కింపు ప్రారంభిస్తారు. అధికార జేడీయూ, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీచేయగా.. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. అటు మరో యువనేత, ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ లేకుండా తొలిసారి బిహార్ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం రాంచీ జైల్లో ఉన్న లాలూ.. బిహార్‌ ప్రజలు తన తనయుడికి పుట్టినరోజు ‘కానుక’ను మంగళవారం ఇవ్వబోతున్నారని జోస్యం చెప్పారు. దాణా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ.. అనారోగ్యం కారణంగా ప్రస్తుతం రాంచీలో చికిత్స తీసుకుంటున్నారు. ఓ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైనా మరో కేసులో బెయిల్ రావాల్సి ఉంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను అధికారులు లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్స్‌లో ఎన్డీఏ 9, మహాకూటమి 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఎన్‌డీఏ కూటమి నుంచి జేడీయూ 115, బీజేపీ 110, ఇతర పార్టీలు 18 స్థానాల్లో పోటీ చేశాయి. మహాకూటమి నుంచి ఆర్జేడీ 144, కాంగ్రెస్ 70, మిగతా 29 చోట్ల వామపక్షాలు బరిలో నిలిచాయి. ఒంటిరిగా బరిలోకి దిగిన ఎల్జేపీ 134 చోట్ల పోటీ చేసింది. బిహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. ఎన్డీఏ, మహాకూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎన్డీఏ స్వల్ప ఆధిక్యం ప్రదర్శిస్తోంది.


By November 10, 2020 at 07:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bihar-assembly-election-2020-results-vote-counting-live-updates/articleshow/79140879.cms

No comments