BB3: బాలయ్య మూవీలో హీరోయిన్ మార్పునకు కారణం అదేనంట!


నందమూరి బాలకృష్ణ, కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ కావటంతో ఈ సినిమాలో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా పూర్ణకు ఓకే చేయగా.. మెయిన్ హీరోయిన్ విషయంలో మాత్రం యూనిట్ చాలా ఇబ్బందులు పడింది. Also Read: ముందుగా బాలయ్య సరసన నటించేందుకు మలయాళ బ్యూటీ ప్రయాగ మార్టిన్‌ను ఫైనల్ చేశారు. అయితే ఆమె కొద్దిరోజులకే ఆమెకు తప్పించినట్లు వార్తలొచ్చాయి. ఆమె స్థానంలో సాయేషా సైగల్‌ను ఓకే చేసినట్లు తాజాగా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయాన్ని సాయేషా సోషల్‌మీడియా ద్వారా నిర్ధారించారు. అయితే ఈ సినిమా నుంచి ప్రయాగ తప్పుకోవడానికి ఏవేవో కారణాలు ప్రచారం జరుగుతున్నాయి.
టెస్ట్ షూట్‌లో బాలయ్య సరసన ఆమె మరీ చిన్నపిల్లలా కనిపించడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్టుగా వార్తలొచ్చాయి. అయితే దీనిపై యూనిట్ క్లారిటీ ఇచ్చింది. బాలయ్య సరసన లుక్ సెట్ అవ్వని కారణంతో తీసేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ప్రయాగనే స్వయంగా తప్పుకున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఈ విషయంలో వస్తున్న రూమర్లకు యూనిట్ చెక్ పెట్టింది. Also Read:By November 12, 2020 at 10:29AM
No comments