Breaking News

Amrita Rao: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహేష్ 'అతిథి' భామ


సినీ నటి, హీరోయిన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కన్ఫమ్ చేస్తూ ఆమె సన్నిహిత వర్గాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆదివారం ఉదయం అమృత తల్లిగా ప్రమోషన్ కొట్టేసిందని, ఆమె మగ బిడ్డకు ప్రాణం పోసిందని తెలుపుతూ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు అమృత రావు, ఆమె భర్త ఆర్‌జే అన్మోల్‌ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ తమ బిడ్డకు స్వాగతం పలికారు. తమకు అభినందనలు, ఆశీర్వాదాలు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని తెలిపారు. అమృత, తమ బాబు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారంటూ సోషల్ మీడియా ద్వారా కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆర్‌జే అన్మోల్‌ని ప్రేమించి పెళ్లాడింది అమృత రావు. ఏడేళ్లు ప్రేమించుకున్న ఈ ఇద్దరూ 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రెగ్నెంట్ అనే విషయాన్ని సీక్రెట్‌గా ఉంచి ఈ నెలలోనే తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన అమృత.. పండంటి బిడ్డకు జన్మనివ్వవడంతో ఆమె కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. Also Read: మహేష్‌బాబు హీరోగా వచ్చిన 'అతిథి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అమృత రావు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించిన ఆమె.. 2019లో నవాజుద్దీన్‌ సిద్ధిఖీతో కలిసి నటించిన ‘ఠాక్రే’లో వెండితెరపై మెరిసి సినిమాకు దూరంగా ఉంటోంది.


By November 02, 2020 at 12:54PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-amrita-rao-rj-anmol-blessed-with-baby-boy/articleshow/78994960.cms

No comments