కరోనాతో బీజేపీ ఎమ్మెల్యే మృతి.. ఇటీవలే కోవిడ్-19తో కన్నుమూసిన ఆయన భార్య
కరోనా వైరస్ బారినపడి ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ప్రజాప్రతినిధులను మహమ్మారి పొట్టనబెట్టుకుంది. తాజాగా, ఉత్తరాఖండ్ బీజేపీ (50) కరోనా వైరస్‌తో మృతిచెందారు. కరోనా వైరస్ బారినపడ్డ ఆయన ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. రెండు వారాల కిందట కరోనా వైరస్ నిర్దారణ కావడంతో ఆయనను చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. సర్ గంగారాం ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్న జీనా ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక, ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ భార్య ధర్మాదేవి సైతం ఇటీవలే కరోనా వైరస్‌తోనే చనిపోయారు. కరోనా వైరస్ సోకిన ఆమె గుండెపోటుతో చనిపోవడం బాధాకరం. ప్రస్తుతం అల్మోరా జిల్లా సాల్ట్ నియోజకవర్గానికి సురేంద్ర సింగ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే స్థానం నుంచి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సురేంద్ర సింగ్ జీనా 2006లో మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత 2007 ఎన్నికల్లో తొలిసారి సాల్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. వరుసగా 2012, 2017 ఎన్నికల్లోనూ అక్కడ నుంచే గెలుపొందారు. ఆయన మరణంపై బీజేపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
By November 12, 2020 at 09:05AM
No comments