ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లికి వెళ్లొస్తూ 14 మంది మృతి
ఆనందంగా పెళ్లికి వెళ్లి తిరిగొస్తున్న వారిని మృత్యువు వెంటాడింది. రూపంలో కబళించింది. కారు వేగంగా ట్రక్కను ఢీకొట్టడంతో 14 మంది మృతి చెందారు. వారిలో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివాహ వేడుకలకు వెళ్లి వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. రాత్రివేళ వేగంగా వచ్చిన కారు అమాంతం ట్రక్కుని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రయాగ్‌రాజ్ - లక్నో రహదారిపై జరిగిన ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోగా.. వారిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఘోర ప్రమాదంపై ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. Also Read:
By November 20, 2020 at 10:34AM
No comments