Telugu Bigg Boss Vote: మా ఓట్లకు విలువ లేనప్పుడు బిగ్ బాస్ ఎందుకు చూడాలి? రగిలిపోతున్న జనం.. యాప్‌ని తీసిపారేస్తున్నారు
మొత్తానికి ఆదివారం నాటి ఎపిసోడ్‌తో నిర్వాహకులు ప్రేక్షకులకు ఒక క్లారిటీ అయితే ఇచ్చినట్టే. ఇన్నాళ్లు బిగ్ బాస్ ఎలిమినేషన్ అనేది ఓటింగ్ ప్రకారం జరుగుతుందా? లేక రేటింగ్ లెక్కలతో జరుగుతుందా? అనే సందేహాలు జనంలో ఉండేవి. కానీ ఇన్నాళ్లు ఓటింగ్ పరిగణలోకి తీసుకుని ఎలిమినేషన్స్ జరిగినా.. లేక అలా భ్రమపడినా ఆదివారం నాటి ఎపిసోడ్‌లో మోనాల్‌ని సేవ్ చేసి కుమార్ సాయిని ఎలిమినేట్ చేయడంతో ఈ ఎలిమినేషన్ అనేది ఓటింగ్ ప్రకారం కాదు.. రేటింగ్ ప్రకారమే ప్రకారమే అని తేటతెల్లం అయ్యింది. దీంతో బిగ్ బాస్ హిస్టరీలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. సోషల్ మీడియా వేదికగా బండబూతులు తిడుతున్నారు. మా ఓట్లకు విలువ లేనప్పుడు మేం బిగ్ బాస్ ఎందుకు చూడాలి?? ఓటింగ్ ప్రక్రియ ఎందుకు పెట్టాలి?? ఓట్లు ఎందుకు వేయించుకోవాలి?? ఆ ఓట్లను పరిగణలోకి తీసుకోకుండా ప్రేక్షకులు మద్దతు తెలిపిన వారిని ఎందుకు ఎలిమినేట్ చేయాలి?? జన్యున్‌గా ఆట ఆడవాళ్లని ఎలిమినేట్ చేయడం దారుణం కాదా? అంటూ నిలదీస్తూ స్టార్ మా, హోస్ట్ నాగార్జునను బండ బూతులు తిడుతున్నారు నెటిజన్లు. నిజానికి బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియపై ఇంత వ్యతిరేకత ఎప్పుడూ లేదు. ఇది నాలుగో సీజన్ కాగా.. గడిచిన నాలుగు సీజన్లలోనూ నామినేషన్స్ విషయంలో ప్రేక్షకుల్లో కాస్తో కూస్తో వ్యతిరేకత ఉన్నా.. ఆ ఎలిమినేషన్‌ను సమర్ధించే వాళ్లు-మద్దతు తెలిపేవాళ్లు సరిసమానంగా ఉండేవారు. ఆ కంటెస్టెంట్‌ని సపోర్ట్ చేసిన వాళ్లు ఇది ఫేక్ ఎలిమినేషన్ అని వాదిస్తే.. జన్యున్ అని సమర్ధించే వారి సంఖ్య అదే స్థాయిలో ఉండేది. కానీ ఈసారి అలాలేదు.. బిగ్ బాస్ ఆట మొదట 16 మందితో మొదలైంది. ఆ తరువాత ముగ్గురు (కుమార్ సాయి, అవినాష్, స్వాతి)లు వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా హౌస్‌లోకి వచ్చారు. ఇప్పటి వరకూ తొలివారంలో సూర్యకిరణ్, రెండో వారంలో కరాటే కళ్యాణి, మూడో వారంలో దేవి, నాలుగో వారంలో స్వాతి, ఐదోవారంలో జోర్దార్ సుజాత, ఆరోవారంలో ఎలిమినేట్ అయ్యారు. ఇక గంగవ్వను అనారోగ్య కారణాలతో బయటకు పంపేశారు. వీరిలో సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, సుజాత ఎలిమినేషన్‌పై ప్రేక్షకుల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు. కానీ దేవి, స్వాతి దీక్షిత్, కుమార్ సాయి ఎలిమినేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. స్వాతి దీక్షిత్‌ని వారంలోనే పంపించడంపై విమర్శలు వచ్చారు. దేవి ఫెయిర్‌గా ఆట ఆడినా కావాలనే బయటకు పంపారనే ఆరోపణలు వచ్చాయి. ఇక కుమార్ సాయి విషయంలో అయితే మరీ దారుణం.. అది కూడా మోనాల్ గజ్జర్‌ని సేవ్ చేసి కుమార్‌ని ఎలిమినేట్ చేయడంతో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. బిగ్ బాస్ అంటే ఫ్యామిలీ షో అని భావించే వాళ్లు. కానీ ఈ సీజన్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవుతూ వస్తున్నారంటే అది కేవలం మోనాల్ గజ్జర్ వల్లే. అఖిల్, అభిజిత్‌లతో ఎఫైర్.. ఓవర్ ఎక్స్ పోజింగ్.. మగాళ్లను రెచ్చగొట్టేసి వాళ్ల మధ్య గొడవలు పెట్టడం.. అఖిల్‌తో మితిమీరి రొమాన్స్ చేయడం.. ముద్దులు, హగ్‌లతో బిగ్ బాస్ హౌస్‌ని లవర్స్ పార్క్‌లో చేసేసింది మోనాల్.. ఆమె ప్రవర్తన చూసి మహిళా ప్రేక్షకులు ఛీ.. ఛీ అంటూ టీవీలు కట్టేసే పరిస్థితి వచ్చింది. అలాంటి కంటెస్టెంట్ కోసం ఆట తప్ప వేరే ధ్యాస లేని కుమర్ సాయి ఎలిమినేట్ చేయడంతో మండి పడుతున్నారు బిగ్ బాస్ ఆడియన్స్.. సోషల్ మీడియా వేదికగా రగిలిపోతున్నారు. వలం టీఆర్పీ రేటింగ్ కోసం ఫెయిర్‌గా ఆట ఆడేవాళ్లను ఎలిమినేట్ చేస్తారా?? ఇక బిగ్ బాస్ షో చూడం.. హాట్ స్టార్ యాప్‌తో పాటు స్టార్ మా ఛానల్‌ను అన్ లైక్ చేస్తాం. అలాగే యూట్యూబ్‌లో బిగ్ బాస్ ప్రోమోకి డిస్ లైక్‌లు కొట్టి మా సత్తా చూపిస్తాం.. అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో ఏదైనా జరగొచ్చు అని తొలి నుంచి చెప్తూనే ఉన్నారు.. నిజమే ఈ ఎలిమినేషన్స్ పక్రియ చూస్తుంటే.. ఏదైనా జరగొచ్చు అనేది నిజమే అనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. ఆ మోనాల్‌ని బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్‌ని చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. Read Also:
By October 19, 2020 at 08:28AM
No comments