Breaking News

Komaram Bheem Teaser: రామరాజు ఫర్ భీమ్.. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లని చీల్చే మండుటెండ


భారీ మూవీ RRR నుంచి '' టీజర్‌తో రణరంగంలోకి దూకారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్‌ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్న జక్కన్న.. చిత్రంలో మన్నెం దొర అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్‌ను, గిరిజన పోరాట యోధుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ను చూపించబోతున్నారు. రెండు వేరు వేరు ప్రాంతాలకు చెందిన ఈ ఇద్దరు వీరులను కలుపుతూ ఎంతో ఆసక్తికరంగా ఈ పీరియాడికల్ స్టోరీ రూపొందిస్తున్న రాజమౌళి తాజాగా 'రామరాజు ఫర్ భీమ్' టీజర్‌ రిలీజ్ చేసి నందమూరి అభిమానులను హూషారెత్తించారు. గతంలో మర్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా 'భీమ్ ఫర్ రామరాజు' అంటూ అల్లూరిగా రామ్ చరణ్ టీజర్ రిలీజ్ చేసి మెగా అభిమానుల్లో జోష్ నింపిన రాజమౌళి.. కరోనా తెచ్చిన లాక్‌డౌన్ కారణంగా ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేయలేకపోయారు. దీంతో మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ టీజర్ రిలీజ్ అవుతుందని భావించిన అభిమానులకు దాదాపు 5 నెలల నిరీక్షణ తప్పలేదు. ఈ నేపథ్యంలో తాజాగా అక్టోబర్ 22 కొమురం భీమ్ జయంతి సందర్భంగా 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ రిలీజ్ చేశారు జక్కన్న. Also Read: 1 నిమిషం 32 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్‌లో రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు చూపిస్తూ ఇప్పటికే RRRపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి రెక్కలు కట్టారు మేకర్స్. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్షన్స్‌కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ తోడు కావడంతో ప్రేక్షకలోకం ఊగిపోతోంది. ''వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి.. నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చను పాలు తాగిన మన్నెం ముద్దుబిడ్డ. నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీమ్..'' అంటూ రామ్ చరణ్ పవర్‌ఫుల్ వాయిస్, పోరాట యోధుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ రూపం ఆకట్టుకుంటున్నాయి. కీరవాణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సింథిల్ కుమార్ కెమెరా పనితనం వావ్ అనిపించేట్టుగా ఉన్నాయి. డీవీవీ దానయ్య సమర్పణలో 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తుండగా.. ఈ చిత్రంలో కీల‌క పాత్రలో బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్‌, రామ్ చ‌ర‌ణ్‌ జంటగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ న‌టిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి RRR (రౌద్రం రుధిరం ర‌ణం) అనే టైటిల్‌ని కన్ఫమ్ చేసి 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసిన యూనిట్ ప్రస్తుతం మిగిలిన భాగం షూట్ చేస్తోంది.


By October 22, 2020 at 11:52AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ramaraju-for-bheem-ntr-teaser-released-from-rrr/articleshow/78803219.cms

No comments