Breaking News

కాజల్‌ పెళ్లి పీటలెక్కేస్తోంది.. మరి ఈ ముదురు బ్యూటీల సంగతేంటో?


సీనియర్ నటి కాజల్ అగర్వాల్‌కి వివాహం నిశ్చయం కావడంతో టాలీవుడ్‌లో పెళ్లిళ్లపై చర్చ మొదలైంది. ఈ నెల 30వ తేదీన తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకోబోతున్నట్లు కాజల్ అఫీషియల్‌గా ప్రకటించింది. కాజల్ చెల్లెలైన హీరోయిన్ నిషా అగర్వాల్ ఏడేళ్ల క్రితమే పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇన్నాళ్లూ కెరీర్లో బిజీగా ఉండటంగా ఊసే ఎత్తలేదు. ఎట్టకేలకు 35ఏళ్లు దాటాక స్నేహితుడిని పెళ్లాడేందుకు సిద్ధమైంది. Also Read: అయితే తెలుగు, తమిళ ఇండస్ట్రీలో 30-35 ఏళ్లు దాటి ఇంకా పెళ్లి చేసుకోని హీరోయిన్లు చాలామంది ఉన్నారు. దీంతో వాళ్లు ఎప్పుడు వివాహం బంధంలోకి అడుగుపెడతారోనని చర్చ మొదలైంది. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సిన స్వీటీ అనుష్క గురించే. టాలీవుడ్‌లో ‘అరుంధతి’ బ్రేక్ తెచ్చుకున్న అనుష్క ఆపై ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. బాహుబలి, బాహుబలి-2, భాగమతి... సినిమాలు ఆమెను మరో పదిమెట్లు ఎక్కించాయి. ప్రస్తుతం అనుష్కకు 38ఏళ్లు నిండాయి. నవంబర్ 7తో 40వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. అయినప్పటికీ పెళ్లి గురించి ప్రశ్నిస్తే అనుష్క ఎప్పుడూ మాట దాటవేస్తుంది. గతంలో ఎన్నో రూమర్లు వచ్చినా ఎప్పుడూ తన వివాహం గురించి ఆమె స్పందించింది లేదు. దీంతో తెలుగు హీరోయిన్లలో ప్రస్తుతం మోస్ట్‌ ఎలిజిబుల్‌ స్పినిస్టర్‌ (పెళ్లి కాని మహిళ) స్వీటీ అనే చెప్పొచ్చు. Also Read: అనుష్క తర్వాత మోస్ట్‌ ఎలిజిబుల్‌ స్పినిస్టర్‌ త్రిష. ప్రస్తుతం ఆమెకు 37 ఏళ్ళు నిండాయి. గతంలో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్‌ మణియన్‌తో నిశ్చితార్థం చేసుకున్న త్రిష.. కాబోయే భర్తతో ప్రత్యేక విమానంలో విహారయాత్రలకూ వెళ్లారు. కానీ ఏమైందో తెలీదు గానీ కొద్దిరోజులకే ఇద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. అప్పటి నుంచి త్రిష మళ్లీ పెళ్లి ఊసే ఎత్తలేదు. వీళ్లిద్దరే కాదు మూడు పదులు దాటినా పెళ్లి గురించి పట్టించుకోకుండా కెరీర్లో దూసుకుపోతున్న కథానాయికలు చాలామంది ఉన్నారు. నయనతార (35), శ్రుతిహాసన్‌ (34), ఇలియానా (33) జీవితాల్లో కంచికి చేరని ప్రేమకథలున్నాయి. తమిళ హీరో శింబు, ఆ తర్వాత ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరొందిన ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపిన నయనతార వాళ్లతో విడిపోయింది. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో ఉంది. ఇటీవలే అతడి పుట్టినరోజు వేడుకలను గోవాలో ఘనంగా జరిపించింది. ప్రియుడి బర్త్‌డే కోసం నయన్ ఏకంగా రూ.25లక్షలు ఖర్చు చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే వీరిద్దరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారన్న దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇద్దరూ ఎక్కడికికెళ్లినా ఆ ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేస్తుంటారు. Also Read: తెలుగమ్మాయి అంజలి (34), తాప్సీ (33), నిత్యా మీనన్‌ (32), రాయ్‌ లక్ష్మి (31) కూడా మూడు పదులు దాటినవాళ్లే. అయినప్పటికీ జీవిత భాగస్వామి గురించి ఆలోచించకుండా ఇంకా కెరీర్‌పైనే ఫోకస్ పెడుతున్నారు. మిల్కీ బ్యూలీ తమన్నాకు కూడా డిసెంబర్ 21తో 32వ వసంతంలోకి అడుగుపెడతారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈషా రెబ్బా, సెప్టెంబర్‌లో శ్రద్ధా శ్రీనాథ్‌ 30 ప్లస్‌ క్లబ్‌లో అడుగు పెట్టారు. అయితే ఇప్పటికీ వీళ్ల వివాహాల గురించి ఎలాంటి రూమర్లు కూడా బయటకి రాకపోవడం గమనార్హం. అంటే వీళ్లకు ఇంకా పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం లేనట్లే కనిపిస్తోంది. Also Read:


By October 07, 2020 at 08:39AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/marriage-discussion-on-tollywood-most-eligible-spinster/articleshow/78525529.cms

No comments