అత్తనీ వదలని అల్లుడు.. భార్య హత్య కేసులో దారుణాలు వెలుగులోకి..
భార్యపై అనుమానంతో తల నరికి ఆమె ప్రియుడిగా అనుమానిస్తున్న ఇంటి ఎదుట పెట్టిన కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అనుమానంతో రాక్షసుడిగా మారిన భర్త 15 ఏళ్ల కిందటే తన అత్తను అంతమొందించినట్లు తెలుస్తోంది. జైలు నుంచి బయటికొచ్చి భార్యను కాపురానికి తీసుకెళ్లాడు. ఇంత జరిగినా అనుమానం చావని కసాయి భర్త నమ్మకంగా ఉంటూ భార్యని అతి కిరాతకంగా చంపేశాడు. నారాయణ్‌ఖేడ్‌లో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు పోలీసులు వెల్లడించారు. నారాయణ్‌ఖేడ్ మండలం అనంతసాగర్‌కి చెందిన సాయిలు(46)కి రేగోడు మండలం చౌదర్‌పల్లికి చెందిన అనసూయ(40)తో సుమారు పాతికేళ్ల కిందట వివాహమైంది. కొద్దికాలం కాపురం సాఫీగానే సాగింది. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న సాయిలు వేధింపులకు గురిచేసేవాడు. ఆ విషయం తల్లి విఠమ్మకు చెప్పుకుని అనసూయ బాధపడేది. ఓ రోజు రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ పరిధిలోని ఎంఐజీలో ఉంటున్న అత్త విఠమ్మ వద్దకి వచ్చిన సాయిలు.. మీ కూతురు మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని చెప్పాడు. అయితే ఆమె కూతురి వైపే మాట్లాడడంతో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆగ్రహంతో రగిలిపోయిన సాయిలు తన సోదరుడి సాయంతో అత్తని కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన 15 ఏళ్ల కిందట జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ కేసులో సాయిలు జైలుకి కూడా వెళ్లొచ్చాడు. అనంతరం పెద్దమనుషుల జోక్యంతో భార్యతో స్వగ్రామంలో కలసి ఉంటున్నాడు. కొద్దికాలం నుంచి అనుమానంతో మళ్లీ వేధిస్తుండడంతో అనసూయ హైదరాబాద్‌లో ఉంటున్న కొడుకు దగ్గరకి వెళ్లింది. Also Read: ఇటీవల సాయిలు ఆమెను హైదరాబాద్ నుంచి గ్రామానికి తీసుకొచ్చాడు. వేధింపులకు గురిచేయనని నమ్మబలికి ఇంటికి తెచ్చాడు. అయినా అనుమానం చావని సాయిలు ఆమెను కిరాతకంగా చంపేశాడు. తల, మొండెం వేరుచేసి తలను తీసుకెళ్లి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానిస్తున్న వ్యక్తి ఇంటి ఎదుట పెట్టి వెళ్లిపోయాడు. ఈ భయానక ఘటనతో గ్రామంలో అలజడి రేగింది. సాయిలు పోలీసులు అరెస్టు చేసి కటకటాలవెనక్కి నెట్టారు. Read Also:
By October 17, 2020 at 09:58AM
No comments