Breaking News

హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో కొత్త ట్విస్ట్.. నిందితుడితో బాధితురాలి ఫోన్ సంభాషణ


దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. బాధిత యువతికి ప్రధాన నిందితుడు ముందే పరిచయం అని పోలీసులు తెలిపారు. వీరిద్దరి మధ్య ఏడాది నుంచి ఫోన్‌ కాల్ సంభాషణ కొనసాగుతున్నట్లు పోలీసులు చెప్పుకొస్తున్నారు. బాధితురాలు ప్రధాన నిందితుడు అయిన సందీప్‌తో నిరంతరం ఫోన్‌‌లో టచ్‌లో ఉన్నట్లు వారు గుర్తించారు. బాధితురాలి సోదరుడు సత్యేంద్ర పేరిట ఉన్న నంబర్‌ నుంచి సందీప్‌కు క్రమం తప్పకుండా యవతి కాల్స్ వచ్చినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఇరువురి మధ్య ఇప్పటి వరకు 100కు పైగా ఫోన్స్ కాల్స్ జరిగినట్లు కాల్ డిటెయిల్ రిపోర్టులో (CDR) తేలిందని తెలిపారు. అక్టోబరు 2019 నుంచి మార్చి 2020 మధ్య ఈ కాల్స్‌ను గుర్తించామని చెప్పారు. బాధితురాలి గ్రామమైన బూల్‌గారి నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో చందపా ప్రాంతంలో ఉన్న సెల్ టవర్‌ నుంచి ఎక్కువ కాల్స్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇరువురి ఫోన్ నంబర్ల మధ్య 62 అవుట్‌ గోయింగ్ కాల్స్, 42 ఇన్‌కమింగ్ కాల్స్.. మొత్తం 104 ఫోన్ కాల్స్ ఉన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కేసులో బాధితురాలి గ్రామానికి చెందిన సందీప్ సింగ్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. Read More: అయితే మృతురాలు, నిందితుడు కొన్ని నెలల పాటు ఫోన్‌లో టచ్‌లో ఉన్నారని పోలీసులు చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఇదంతా అబద్ధమని కొట్టి పారేస్తున్నారు యువతి కుటుంబ సభ్యులు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని పోలీసుల తీరుపై దళిత సంఘాలతో పాటు విపక్షాలు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే కేసును తప్పుదోవ పట్టించడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇవాళ ఈ కేసుపై సిట్‌ బృందం సీఎం యోగికి నివేదిక ఇవ్వనుంది.


By October 07, 2020 at 08:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/new-twist-in-hatras-gang-rape-100-calls-took-place-between-accused-and-victim/articleshow/78525563.cms

No comments