Breaking News

స్వతంత్రంగా ఎదగాలనుకున్న కూతురు.. కుదరదన్న కుటుంబ సభ్యులు.. చిత్తూరులో విషాదం


బాగా చదువుకుని స్థిరపడాలని.. స్వతంత్రంగా ఎదగాలని కలలు కన్న యువతి పెద్దల నిర్ణయంతో మనస్థాపానికి గురైంది. పెళ్లి చేసి పంపించేస్తామని తేల్చిచెప్పడంతో దారుణ నిర్ణయం తీసుకుంది. పుట్టినరోజు నాడే చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ అత్యంత విషాద ఘటన జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో జరిగింది. పాలసముద్రం మండలం ఏటుకూరిపల్లెకి చెందిన శశికళకి కొడుకు నరేష్, కూతురు నందిని(18) సంతానం. తమిళనాడులో నివాసముంటున్న సమయంలో భర్త రోడ్డు ప్రమాదంలో మరణించడంతో బిడ్డలతో సహా పుట్టింటికి వచ్చేసింది. గ్రామంలో కూలీపనులకు వెళ్తూ పిల్లలను చదివించుకుంటోంది. డిగ్రీ పూర్తి చేసిన కూతురు నందినికి పెళ్లి చేయాలిన పెద్దలు నిర్ణయించారు. తాను బాగా చదువుకుని స్థిరపడాలని.. స్వతంత్రంగా ఎదగాలను కలలు కనే నందిని పెళ్లి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా కుటుంబ సభ్యులు పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుంటామంటూ తెగేసి చెప్పడంతో యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. Also Read: సరిగ్గా పుట్టినరోజు నాడే ప్రాణాలు తీసుకుంది. ఉదయం పది గంటలకు అందరి సమక్షంలో బర్త్‌ డే వేడుకలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అంతకుముందే 8 గంటలకు ఇంటి నుంచి బయటికెళ్లిన నందిని.. ఊరి శివారులోని పొలంలోని వ్యవసాయ బావిలో దూకేసింది. అది గమనించిన స్థానికులు వెంటనే బావి వద్దకు చేరుకునేలోపే ఆమె నీటిలో మునిగిపోయింది. బావి పక్కన యువతి చెప్పులు చూసి ఆమె నందినిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బావి వద్దకు చేరుకున్నారు. నాలుగు గంటలపాటు శ్రమించి యువతి మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Read Also:


By October 28, 2020 at 10:14AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/18-year-old-girl-commits-suicide-in-chittoor/articleshow/78904967.cms

No comments