‘మన బంధం మరింత బలపడాలి’.. తమ్ముడికి విషెస్ చెప్పిన చిరంజీవి

నటుడిగా, నిర్మాతగా సినీరంగంతో పాటు బుల్లితెరపైనా తనముద్ర వేసిన మెగా బ్రదర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులతో పాటు సినీ ప్రముఖులు ఆయనకు సోషల్‌మీడియా ద్వారా బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ తన తమ్ముడికి శుభాకాంక్షలు చెబుతూ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. Also Read: ‘విధేయుడు, భావోధ్వేగం కలిగిన వాడు, దయా హృదయుడు, సరదా వ్యక్తి నా సోదరుడు నాగబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని, నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను’ అంటూ చిరంజీవి ట్వీట్ చేస్తూ నాగబాబు, పవన్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. చిరంజీవి ట్వీట్‌కు నాగబాబు రిప్లయ్ ఇస్తూ... ‘థ్యాంక్స్ అన్నయ్య, నేనేప్పుడు నీతోడుగానే ఉంటా’ అంటూ రిప్లై ఇచ్చారు. Also Read:
By October 29, 2020 at 01:17PM
No comments