ఆలియాకు టైమొచ్చింది... ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో బాలీవుడ్ భామ!

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌తో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ వేగంగా కొనసాగుతుంది. కరోనా విషయంలో పక్కా జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ చేస్తున్నారు. కథానాయకులు రామ్‌చరణ్, ఎన్టీఆర్ కూడా షూటింగులో పాల్గొంటున్నారు. ఇందులో రామ్‌చరణ్‌కు జంటగా సీత పాత్రలో నటిస్తున్న ఇప్పటివరకు యూనిట్‌తో కలవలేదు. తాజాగా ఆమె రాకకు సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే సెట్‌కు రానున్న ఆలియా నవంబర్ నుంచి ఏకధాటిగా షూటింగులో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్‌పై ఇప్పటికే కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. Also Read:
By October 21, 2020 at 08:27AM
No comments