Breaking News

శామ్‌సం‌గ్ ఛైర్మన్ కున్ హీ లీ కన్నుమూత


కున్ హీ లీ (78) కన్నుమూశారు. 2014 నుంచి హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆయన ఆదివారం కన్నుమూసినట్టు శామ్‌సంగ్ సంస్థ ప్రకటించింది. గుండెకు 2014లో కున్ హీ లీ శస్త్రచికిత్స చేయించుకున్నారు. శామ్‌సంగ్‌ను ప్రపంచ దిగ్గజ సంస్థగా మార్చడంలో లీ ఎనలేని కృషి ఉంది. తమ ఛైర్మన్ కున్-హీ-లీ కన్నుమూశారని ప్రకటించడం చాలా విచారకరమని శామ్‌సంగ్ తన ప్రకటనలో పేర్కొంది. అక్టోబరు 25న ఆయన కన్నుమూశారని, ఆ సమయంలో కుటుంబసభ్యులు, వైస్-ఛైర్మన్ జే వై లీ పక్కనే ఉన్నారని తెలిపింది. శామ్‌సంగ్‌ను స్థానిక వ్యాపార సంస్థ నుంచి ప్రపంచ-ప్రముఖ దిగ్గజంగా, పారిశ్రామిక శక్తి కేంద్రంగా మార్చిన ఛైర్మన్ లీ నిజమైన దార్శనికుడు..ఆయన వారసత్వం శాశ్వతమైనది అని ప్రశంసించింది. ప్రపంచంలోని 12వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన దక్షిణ కొరియాలో ఆధిపత్యం చలాయించే సంస్థలలో శామ్‌సంగ్ అతి పెద్దది. ఆ సంస్థ మొత్తం టర్నోవర్ దక్షిణ కొరియా జీడీపీలో ఐదో వంతు. దక్షిణ కొరియా ఆర్ధిక వ్యవస్థలో దీని పాత్ర కీలకం. కున్ హీ లీ అనారోగ్యం బారిపడటంతో 2014 నుంచి సంస్థ బాధ్యతలను ఆయన కుమారుడు, వైస్ ఛైర్మన్ లీ జే యంగ్ చేపట్టారు. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు పార్క్ జియున్-హేతో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు తేలిన తరువాత 2017లో లీ ఐదేళ్లపాటు జైలు శిక్ష ఖరారయ్యింది. ఆయన అప్పీల్‌పై అత్యంత తీవ్రమైన ఆరోపణలను తొలగించడంతో ఏడాది తరువాత విడుదలయ్యారు.


By October 25, 2020 at 07:49AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/samsung-electronics-chairman-lee-kun-hee-passes-away-due-to-health-illness/articleshow/78853296.cms

No comments