చీరల కోసం వెళ్లి.. శవమైన లేడీ డాక్టర్.. అనంతపురంలో దారుణం
జిల్లాలో కలకలం రేపిన కల్వర్టు కింద కాలిపోయిన మహిళ మృతదేహం మిస్టరీ వీడింది. చీరల కోసం దుకాణానికి వెళ్లిన మహిళపై షాపు యజమాని అత్యాచార యత్నం చేసి దారుణంగా హత్య చేసినట్లు తేలింది. అనంతరం ఆమె ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. షాపు యజమాని సహా అతనికి సహకరించిన భార్య, స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ధర్మవరానికి చెందిన ఫిజియోథెరపిస్ట్ కల్పనారెడ్డి(32)కి బత్తలపల్లి మండలం గుమ్మళ్లకుంటకి చెందిన వ్యక్తితో 13 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఒక కొడుకు సంతానం. కొద్దికాలం కిందట కల్పనారెడ్డి కుటుంబం ధర్మవరానికి వచ్చి ఉంటున్నారు. మనస్పర్థలు రావడంతో కల్పనారెడ్డి భర్త నుంచి విడిపోయింది. భర్త కొడుకుతో సహా స్వగ్రామానికి వెళ్లిపోవడంతో ఆమె ధర్మవరంలో ఒంటరిగా ఉంటోంది. చీరలు కొనేందుకు తరచూ చింతల రాయుడు అనే వ్యక్తి దుకాణానికి వెళ్లేది. చీరలతో పాటు చీటీల వ్యవహారంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. గత జూన్ 29న ఎప్పటిలాగే కల్పనారెడ్డి చీరల కోసం రాయుడు దుకాణానికి వెళ్లింది. ఒంటరిగా ఉంటున్న ఆమెపై ఎప్పటి నుంచో కన్నేసిన షాపు యజమాని దారుణానికి పాల్పడ్డాడు. లాక్‌డౌన్ కారణంగా షాపు మూసే సమయమైందని నమ్మించిన రాయుడు.. ఆమెను లోపలికి రమ్మని చెప్పి దుకాణం షట్టర్ వేశాడు. మంచి చీరలు చూపిస్తానంటూ లోపలి గదిలోకి తీసుకెళ్లి చేసేందుకు యత్నించడంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. తన వాళ్లతో చెప్పి నీ అంతు చూస్తానంటూ కల్పనారెడ్డి హెచ్చరించడంతో అందరికీ తెలిసిపోతుందని భావించి ఆమెను దారుణంగా చంపేశాడు. ఆమె స్కార్ఫ్‌ని గట్టిగా ముఖానికి చుట్టి ఊపిరాడకుండా చేసి అంతమొందించాడు. విషయం తన భార్య హేమలత, స్నేహితుడు జగదీష్‌కి చెప్పాడు. మృతదేహాన్ని అట్టపెట్టెలో పెట్టేసి ముదిగుబ్బ మండలం దొరిగిల్లు వెళ్లే దారిలో కల్వర్టు కింద పడేశారు. ఆమెను ఎవరైనా గుర్తుపడితే దొరికిపోతామని భావించి మరుసటి రోజు వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. Also Read: నాలుగు రోజుల అనంతరం కల్వర్టు కింద కాలిపోయిన మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని పరిశీలించి ఆమె ఆచూకీ కనుగొనేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నించారు. ధర్మవరానికి చెందిన జగన్నాథరెడ్డి తన కూతురు కల్పనా రెడ్డి మృతదేహంగా గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు చింతల రాయుడు, అతనికి సహకరించిన భార్య హేమలత, స్నేహితుడు జగదీష్‌ని అరెస్టు చేశారు. Read Also:
By October 01, 2020 at 10:11AM
No comments