Breaking News

అమెరికా అధ్యక్ష ఎన్నికలు: ఉపాధ్యక్ష అభ్యర్థులు కమలా, పెన్స్ మధ్య వాడీవేడీ చర్చ


అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా డెమోక్రాట్, రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థులు కమలా హ్యారిస్, మధ్య జరిగిన చర్చ వాడివేడిగా జరిగింది. బుధవారం సాల్ట్ లేక్ సిటీలోని ఉటాయ యూనివర్సిటీ వేదిక జరిగిన చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష అభ్యర్థులు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. కరోనా వైరస్ మహమ్మారిని కట్టడిచేయడంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా విఫలమయ్యాడని డెమోక్రాట్ వైస్-ప్రెసిడెంట్ అభ్యర్ధి విమర్శించారు. అంతేకాదు, అధ్యక్షుడు సహా అనేక మంది వైరస్ బారినపడటంతో మహమ్మారిని నియంత్రించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని దుయ్యబట్టారు. అమెరికా చరిత్రలోనే ఇంతటి విఫలమైన అధ్యక్షుడిని ప్రజలు చూసి ఉండరని కమలా మండిపడ్డారు. ట్రంప్‌ అసమర్థ పాలనతో 2లక్షల మంది అమెరికన్లు కరోనా సోకి మృత్యువాత పడ్డారని, దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని విమర్శించారు. కరోనా వైరస్‌పై ముందస్తు సమాచారం ఉన్నా ట్రంప్‌ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేదని హారిస్‌ అన్నారు. బ్రయానా టేలర్ కేసులో ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. కమలా హ్యారిస్ వ్యాఖ్యలను మైక్ పెన్స్ ఖండిస్తూ.. కోవిడ్-19పై పోరాటానికి అమెరికా యంత్రాంగం సమర్ధంగా పనిచేస్తోందని, మహమ్మారికి మూలకేంద్రమైన చైనా ప్రయాణాలపై అధ్యక్షుడు ట్రంప్ జనవరి చివరిలోనే నిషేధం విధించారని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే అమెరికా పౌరుల ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ విషయాన్ని ప్రతి అమెరికన్ తెలుసుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. ఒబమా కేర్ దారుణంగా విఫలం కావడంతోనే దానిని రద్దుచేశామని అన్నారు. ఆరోగ్య సంరక్షణ చట్టం అమలుకు ట్రంప్ యంత్రాంగం చేసిన ప్రయత్నంపై హారిస్ అనేకసార్లు విమర్శలు గుప్పించారు. అధ్యక్షుడి ఆదాయపు పన్ను కింద ఏడాదికి 750 డాలర్లు చెల్లించడంపై ఎదురు దాడి చేశారు. ట్రంప్‌ కేవలం 750 డాలర్ల ఆదాయ పన్నే చెల్లించారని, పన్ను విషయం దాచాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. దీనికి పెన్స్ కౌంటర్ ఇస్తూ.. పెద్ద మొత్తంలో ట్రంప్ పన్నులు చెల్లించారని అన్నారు. జో బిడెన్ అధ్యక్షుడైతే తొలి రోజు నుంచే పన్నులను పెంచబోతున్నాడని అన్నారు. కొవిడ్‌ వ్యాప్తికి చైనానే కారణమని, ట్రంప్‌ చర్యల వల్లే వేలాది అమెరికన్లకు ప్రాణాపాయం తప్పిందన్నారు. చైనాపై ప్రయాణ ఆంక్షలను బిడెన్‌ వ్యతిరేకించిన విషయాన్ని పెన్స్‌ ప్రస్తావించారు. జో బిడెన్‌ చైనాకు దశాబ్దాలుగా చీర్‌ లీడర్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ ఏడాది చివరికల్లా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని, 5 కంపెనీల వ్యాక్సిన్‌ ప్రయోగాలు మూడో దశలో ఉన్నాయని వివరించారు. వ్యాపారవేత్త అయిన ట్రంప్‌ ఆదాయపన్నుగా మిలియన్‌ డాలర్లు చెల్లించారని మైక్‌ పెన్స్‌ పేర్కొన్నారు.


By October 08, 2020 at 10:03AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-elections-2020-kamala-harris-mike-pence-clash-at-us-vice-president-debate/articleshow/78546833.cms

No comments